ఉల్లాసంగా, ఉత్సాహంగా గీతం 'ఫ్రెషర్స్ డే' (ఫోటోలు)
హైదరాబాద్: గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంలో బీటెక్-2015 బ్యాట్ తొలి ఏడాది విద్యార్ధులను సాదరంగా స్వాగతిస్తూ బుధవారం 'ఫ్రెషర్స్ డే'ని ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్వహించారు. కొత్తగా చేరిన విద్యార్ధులలో ఉండే సంశయాలు, భయాన్ని పోగొట్టి తమతో కలిసిపోయేలా సీనియర్లు అవకాశం కల్పించారు.
గీతం విశ్వవిద్యాలయంలో చేరిన తొలి ఏడాది బీటెక్ విద్యార్ధులకు 'ఫ్రెషర్స్ డే'ని ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోయేలా చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలు, నేపథ్యాల నుంచి ఒకే లక్ష్య సాధన కోసం వచ్చిన విద్యార్ధుల మేలికలయికతో గీంతో కొత్త శోభను సంతరించుకుంది.

ఉల్లాసంగా, ఉత్సాహంగా గీతం 'ఫ్రెషర్స్ డే'
ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్ని ఇంజనీరింగ్ విభాగాల విద్యార్ధుల అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్లంటే జూనియర్లకు సహజంగానే ఉండే భయాన్ని పోగొట్టి దగ్గర కావడానికి ఈ కార్యక్రమాలు తోడ్పడ్డాయి.

ఉల్లాసంగా, ఉత్సాహంగా గీతం 'ఫ్రెషర్స్ డే'
పరిమితులకు లోబడి అధ్యాపకుల సమక్షంలో 'ఫ్రెషర్స్ డే' కార్యక్రమాన్ని విద్యార్ధులు నిర్వహించుకోవడానికి గీతం యాజమాన్యం అంగీకరించింది. సీనియర్ విద్యార్ధులతో జూనియర్లు పరిచయాలు పాటలు, వ్యక్తిగత-బృంద నృత్యాలు, క్యాట్ వాక్, వాద్య కచేరీ, ఏకపాత్రాభినయం, కవితలు, మిమిక్రీ వంటి పలు కళలను వైవిధ్య భరితంగా ప్రదర్శించారు.

ఉల్లాసంగా, ఉత్సాహంగా గీతం 'ఫ్రెషర్స్ డే'
గీతం ప్రాంగణంలో నెలకొని ఉన్న మౌళిక సదుపాయాలను విద్యార్ధులు సక్రమంగా వినియోగించుకుని, పరిశోధానాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ శివప్రసాద్ సూచించారు.

ఉల్లాసంగా, ఉత్సాహంగా గీతం 'ఫ్రెషర్స్ డే'
ఆచరణాత్మక విద్యార్జన, వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాల్సిన ఆవశ్యకతల గురించి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీహెచ్. సంజయ్ వివరించారు. క్రమశిక్షణ ఆవశ్యకతను గురించి గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ వివరించారు.

ఉల్లాసంగా, ఉత్సాహంగా గీతం 'ఫ్రెషర్స్ డే'
ర్యాంగింగ్‌కు పాల్పడితే జరిగే పర్యవసానాలు, దానివల్ల భవిష్యత్తు ఎలా అంథకారం అవుతుందో పటాన్ చెరువు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ. కృష్ణయ్య వివరించారు. ర్యాంగింగ్‌కు పాల్పడబోమని విద్యార్ధులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు.












Click it and Unblock the Notifications