బుద్ధుడి విగ్రహం: చైనాలో మొండెం, జపాన్‌లో తల

బీజింగ్: గౌతమ బుద్ధుడి అతి ప్రాచీన విగ్రహపు తలను దాని మొండేనికి అతికించారు. చైనాకు చెందిన ఓ మాజీ ప్రొఫెసర్ క్రీ.శ. 618-907 మధ్య కాలానికి చెందిన ఈ విగ్రహం 2006 తవ్వకాల్లో చైనాలో బయటపడింది.

కాగా, మొండెం మాత్రమే లభ్యం కావడంతో అధికారులు దాన్ని హెబై ప్రావిన్స్‌లోని మ్యూజియంలో భద్రపర్చారు. 2013లో హెబై నార్మల్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ గువోపెంగ్‌ను ఈ విగ్రహం అమితంగా ఆకర్షించింది.

Head of Buddha statue from Japan reunited with body in China

ఆయన జపాన్ వెళ్లినప్పుడు అక్కడ ఓ సేకర్త దగ్గర విగ్రహపు తల భాగం ఉన్నట్లు గుర్తించి దాన్ని చైనాకు తీసుకొచ్చారు. 2014 అక్టోబర్‌లో తలను తీసుకురాగా, ఇన్నాళ్లకు తలలేని మొండేనికి చక్కగా అతికించారు.

దీంతో ఆ తథాగతుడి విగ్రహం విద్యుత్ దీపాల కాంతుల్లో మిరుమిట్లు గొలుపుతోంది. మ్యూజియం డైరెక్టర్ లూ జియాంగ్జున్ జపాన్‌లోని తలను తీసుకొచ్చి విగ్రహానికి అతికించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ తరాలకు ఈ చారిత్రక బుద్ధిడి విగ్రహాన్ని అందించడం జరుగుతోందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+