‘పరాఠా పోస్ట్‌’ను చేజిక్కించుకున్న ‘హలో కర్రీ’(పిక్చర్స్)

హైదరాబాద్: నగరానికి చెందిన ప్రముఖ ఫుడ్ చైన్ సంస్థ ‘హలో కర్రీ'.. పరాఠా పోస్ట్‌ను చేజిక్కించుకున్నట్లు మంగళవారం ప్రకటించింది. కొంత నగదు, కొంత మొత్తానికి షేర్లు ఇచ్చే ప్రాతిపదికన పరాఠా పోస్ట్‌ను కొనుగోలు చేసినట్లు హలోకర్రీ సీఈఓ రాజు భూపతి, పరాఠా పోస్ట్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ ముకేశ్‌ లాంబా వెల్లడించారు.

ఫాస్ట్‌ ఇండియన్‌ ఫుడ్‌ అందించే సంస్థగా హలోకర్రీని నిరుడు ఔత్సాహికులైన రాజు భూపతి, సందీప్‌ పెన్మత్స ప్రారంభించారు. దీనికి శ్రీ కేపిటల్‌ వ్యవస్థాపకుడైన శశిరెడ్డి మద్దతు నిచ్చారు. ఈ సంస్థ హైదరాబాద్‌లోనే కాకుండా బెంగళూరులోనూ తన సేవలు ప్రారంభించింది. రుచికరమైన మెనూతో పాటు, ఆకర్షణీయ ప్యాకింగ్‌, వేగవంతమైన డెలివరీ ప్రమాణాలతో తక్కువ సమయంలోనే వినియోగదార్లకు తాము దగ్గరైనట్లు రాజు భూపతి తెలిపారు.

'పరాఠా పోస్ట్‌' ఆన్‌లైన్‌ ఆర్డర్ల ప్రకారం పరాఠాలు అందించే సంస్థగా రెండేళ్ల క్రితం ఇద్దరు ఐఐఎం గ్రాడ్యుయేట్లు ముకేశ్‌ లాంబా, రితురాజ్‌ నెలకొల్పారు. 55 రకాల పరాఠాలు అందించే సంస్థగా ఇది విస్తరించింది. నిరుడు 3 లక్షల పరాఠాలను ఇది విక్రయించింది. 60,000 ఆర్డర్లను నిర్వహించింది.

ఒకే విభాగంలో కార్యకలాపాలు సాగిస్తూ ఉండటం, త్వరితగతిన ఎదగాలనే ఆలోచన తమకు ఉండటంతో పరాఠా పోస్ట్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన తమకు వచ్చిందని రాజు భూపతి వివరించారు. పరాఠా పోస్ట్‌ బ్రాండ్‌ను కొంతకాలం పాటు కొనసాగిస్తామని, ఆ తర్వాతే దానిపై ఏ నిర్ణయమైనా ఉంటుందని అన్నారు.

హలో కర్రీ చేతికి పరాఠా పోస్ట్

హలో కర్రీ చేతికి పరాఠా పోస్ట్

హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ఫుడ్ చైన్ సంస్థ ‘హలో కర్రీ'.. పరాఠా పోస్ట్‌ను చేజిక్కించుకున్నట్లు మంగళవారం ప్రకటించింది.

హలో కర్రీ చేతికి పరాఠా పోస్ట్

హలో కర్రీ చేతికి పరాఠా పోస్ట్

కొంత నగదు, కొంత మొత్తానికి షేర్లు ఇచ్చే ప్రాతిపదికన పరాఠా పోస్ట్‌ను కొనుగోలు చేసినట్లు హలోకర్రీ సీఈఓ రాజు భూపతి, పరాఠా పోస్ట్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ ముకేశ్‌ లాంబా వెల్లడించారు.

హలో కర్రీ చేతికి పరాఠా పోస్ట్

హలో కర్రీ చేతికి పరాఠా పోస్ట్

ఫాస్ట్‌ ఇండియన్‌ ఫుడ్‌ అందించే సంస్థగా హలోకర్రీని నిరుడు ఔత్సాహికులైన రాజు భూపతి, సందీప్‌ పెన్మత్స ప్రారంభించారు. దీనికి శ్రీ కేపిటల్‌ వ్యవస్థాపకుడైన శశిరెడ్డి మద్దతు నిచ్చారు. ఈ సంస్థ హైదరాబాద్‌లోనే కాకుండా బెంగళూరులోనూ తన సేవలు ప్రారంభించింది.

హలో కర్రీ చేతికి పరాఠా పోస్ట్

హలో కర్రీ చేతికి పరాఠా పోస్ట్

రుచికరమైన మెనూతో పాటు, ఆకర్షణీయ ప్యాకింగ్‌, వేగవంతమైన డెలివరీ ప్రమాణాలతో తక్కువ సమయంలోనే వినియోగదార్లకు తాము దగ్గరైనట్లు రాజు భూపతి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+