‘చిరు’తో ఛాన్సోస్తే వదులుకోను: తమన్నా(పిక్చర్స్)

హైదరాబాద్: తన గ్లామర్ రహస్యం ఆయుర్వేద సౌందర్య ఉత్పత్తులేనని మిల్కీ బ్యూటీ తమన్నా అన్నారు. బంజారాస్ హెయిర్ ఆయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న తమన్నా శనివారం ఆ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆ సంస్థ ఉత్పత్తులు వినియోగించినవారికి నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి ఆమె బహుమతులు అందజేశారు. సహజసిద్ధమైన అందానికి ఎప్పుడూ ఆయుర్వేద ఉత్పత్తులే సరైనవని తమన్నా చెప్పారు.

బాహుబలి ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడుతూ... బాహుబలి సినిమాలో నటించే అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ‘షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ సినిమా సక్సెస్ అవుతుందనుకున్నాను. కానీ, ఇంత గొప్ప సక్సెస్ సాధిస్తుందని అనుకోలేదు. ఇంత పేరొస్తుందని ఊహించనే లేదు' అన్నారు.

‘ఇప్పటి దాకా గ్లామర్ రోల్స్ చేసిన నాకు ఈ సినిమాలో అందుకు భిన్నమైన అవకాశం వచ్చింది. కత్తియుద్ధం షూటింగ్‌లోనే కాదు షూటింగ్‌కు ముందు రోజుల్లోనూ కష్టపడ్డాను' అని తెలిపారు.

‘స్క్రీన్‌పై బాగా ఉండాలని 15 రోజుల పాటు ఓ మాస్టర్ వద్ద కత్తనేర్చుకుని షూటింగ్‌కు వచ్చాను. ఈ సినిమాలో నేను సరిగా నటించగలనో? లేదో? అనే డౌట్ ఉంది. కానీ కొద్ది రోజులకే ఆ డౌట్ లేకుండా చేశారు రాజమౌళి గారు' అని తెలిపారు.

‘ఈ షూటింగ్‌తో నాకో విష యం తెలిసొచ్చింది. సినిమాల్లో హీరోయిన్ కంటే హీరోలకే ఎక్కువ కష్టాలుంటాయని. ఫైట్లు ఎంత కష్టమో చేస్తే తెలిసింది' అని చెప్పారు. కాగా, ‘బాహుబలి 2తో పాటు కార్తీ, నాగార్జున నటిస్తున్న చిత్రంలో, రవితేజ సరసన మరో చిత్రంలో నటిస్తున్నాను. చిరంజీవి 150వ సినిమాలో నటించే అవకాశం వస్తే చేయాలని ఉంది. అయినా కాదని ఎవరంటారు' అని అన్నారు.

తమన్నా

తమన్నా

తన గ్లామర్ రహస్యం ఆయుర్వేద సౌందర్య ఉత్పత్తులేనని మిల్కీ బ్యూటీ తమన్నా అన్నారు.

తమన్నా

తమన్నా

బంజారాస్ హెయిర్ ఆయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న తమన్నా శనివారం ఆ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

తమన్నా

తమన్నా

ఈ సందర్భంగా ఆ సంస్థ ఉత్పత్తులు వినియోగించినవారికి నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి ఆమె బహుమతులు అందజేశారు.

తమన్నా

తమన్నా

సహజసిద్ధమైన అందానికి ఎప్పుడూ ఆయుర్వేద ఉత్పత్తులే సరైనవని తమన్నా చెప్పారు.

తమన్నా

తమన్నా

‘మా అమ్మ నేచురల్ ప్రొడక్ట్స్‌ని అలవాటు చేసింది. మంచి ఫలితాలున్నాయి. రెగ్యులర్‌గా ఉయదం గంటసేపు వర్కవుట్స్ చేస్తాను. హెల్తీ డైట్ తీసుకుంటాను. అవే నా గ్లామర్‌కు కారణ' అని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+