అమ్మకానికి ఇల్లు:కొనేవారికి ఇంటితోపాటు ఇల్లాలు ఫ్రీ
ఇండోనేషియాలో ఓ మహిళ ఇంటితో పాటు ఇల్లాలిని సొంతం చేసుకోండంటూ ఇచ్చిన ప్రకటన ఆన్‌లైన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 40 ఏళ్ల వినాలియా ప్రకటించిన ఈ అధ్బుత ఆఫర్ గురించి తెలుసుకుందాం. ఇండోనేషియాలోని జావా దీవిలో నివసిస్తున్న బ్యూటీషియన్ వినాలియాకు సొంతంగా ఓ పార్లర్‌తో పాటు రెండతస్తుల భవనం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం తన భర్తను కోల్పొయిన ఆమె ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది.
తనకి, పిల్లలకు తోడు కోసం రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు అవసరమయ్యే డబ్బు కోసం ఇల్లుని అమ్మిపెట్టమని ప్రాపర్టీ సెల్లరైన తన స్నేహితున్ని సంప్రదించింది. ఆ స్నేహితుడే తెలివిగా ఈ ప్రకటనను రూపొందించాడు. వినాలియా ఇంటిని కొన్న వ్యక్తి, ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చాడు.

ఈ విషయంపై వినాలియా సీరియస్‌గా తీసుకునే వాళ్లు మాత్రమే తన ఇంటిని చూసేందుకు రావాలని, కొన్ని షరతులు కూడా వర్తిస్తాయని పేర్కొంది. ఇంటి ధర $ 75,000. ఇందులో ఎలాంటి తగ్గింపు ఉండదని ముందుగానే ప్రకటనలో వినాలియా పేర్కొంది. ముస్లిం దేశమైన ఇండోనేషియాలో ఇలాంటి ప్రకటనన చూసిన అక్కడి వారంతా ఖంగుతిన్నారు.
ఆమెను ఇంటర్యూ చేసేందుకు కొంత మంది జర్నిలిస్ట్‌లు కూడా ఆసక్తి చూపించారు. ఈ ప్రకటన గురించి తెలుసుకున్న పోలీసులు ఇదేమి ప్రకటనని ప్రశ్నించగా ఇది తన ఐడియా కాదని వారికి చెప్పడంతో వారు వెనుదిరిగారు.
ఆన్‌లైన్‌లో ఈ ప్రకటనను చూసి బుధవారం ఒకే ఒక్క కొనుగోలుదారుడు మాత్రమే ముందుకొచ్చాడని, ఆయనకు ఇల్లు నచ్చకపోడవంతో వెనుదిరిగి వెళ్లినట్లు వినాలియా తెలిపింది. ఇల్లు అమ్మిన తర్వాత కూడా భార్య హోదాలో అదే ఇంట్లో యజమానిరాలిగా ఉండాలనుకుంటున్న వినాలియా ఐడియా అధ్బుతంగా ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications