క్రీడాకారిణి ప్రతిమతో ఇషాంత్ ప్రేమ మొదలైందిలా..!

న్యూఢిల్లీ: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తన ప్రియురాలు, భారత బాస్కెట్ బాల్ క్రీడాకారిణి ప్రతిమ సింగ్‌తో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇషాంత్, ప్రతిమల ప్రేమ వ్యవహారంపై ఇప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. వారిద్దరూ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారని తెలిసింది.

వారిద్దరి ప్రేమ ఎలా మొదలైందంటే... ప్రతిమ సింగ్.. ప్రస్తుత భారత బాస్కెట్‌బాల్‌ జట్టులో సభ్యురాలు. ఆమె అక్క ఆకాంక్ష ఆ జట్టుకు కెప్టెన్‌. 2011లో ఆకాంక్ష.. మహిళల కోసం ఢిల్లీలో ఓ బాస్కెట్‌బాల్‌ టోర్నీ నిర్వహించింది. అప్పుడు ముఖ్య అతిథిగా ఇషాంత్‌శర్మను పిలిచింది. తన ఎత్తుకు తగ్గ అమ్మాయి దొరుకుతుందని వెళ్లాడో ఏమోగానీ.. ప్రతిమను చూడగానే ప్రేమలో పడిపోయాడట ఇషాంత్‌.

How Ishant Sharma met his match Pratima Singh on basketball court

స్వతహాగా సిగ్గరి అయిన ఇషాంత్‌.. ప్రేమ విషయంలో మాత్రం ముందు తానే చొరవ తీసుకున్నాడట. ఓసారి బయటికి వెళ్దామంటూ ప్రతిమను అడిగాడట. కానీ ఆ విషయం కాస్త ఆకాంక్షకు చెప్పిందట ప్రతిమ. అయితే ఇషాంత్‌ మీదున్న నమ్మకంతో ఆకాంక్ష.. మరేం ఫర్వాలేదని చెల్లెలికి చెప్పింది. అక్క ఓకే చెప్పడంతో ఇక్కడే మొదలైంది ఇషాంత్, ప్రతిమల ప్రేమ పరిచయం.

ఆ తర్వాత ఓ శుభముహుర్తం చూసుకుని.. గులాబీలు, బహుమతులతో నిండిన కారులో ప్రతిమకు తన ప్రేమ విషయం చెప్పాడట ఇషాంత్‌. ఆమె కూడా సంతోషంగా ఒప్పుకుందట. ఇక అప్పట్నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ప్రేమపక్షులు.. దాదాపు ఐదేళ్ల తర్వాత ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు.

ఇది ఇలా ఉంటే.. బాస్కెట్ బాల్ క్రీడాకారిణి ప్రతిమ కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆమెకు నలుగురు అక్కలు. వీళ్లందరూ కూడా బాస్కెట్ బాల్ ప్లేయర్లే. దీంతో ఈ ఐదుగురు అక్కాచెల్లెళ్లను అందరూ 'సింగ్‌ సిస్టర్స్‌' అని పిలుస్తుంటారు. రెజ్లింగ్‌లో 'ఫోగట్‌ సిస్టర్స్‌'లా.. వీళ్లు బాస్కెట్‌బాల్‌లో ప్రసిద్ధి. మొత్తం ఐదుగురూ దేశం తరఫున బాస్కెట్‌బాల్‌ ఆడారు. ప్రస్తుతం ప్రతిమ అక్క ఆకాంక్ష భారత జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతోంది.

How Ishant Sharma met his match Pratima Singh on basketball court

మరో అక్క ప్రశాంతి కూడా జట్టులో సభ్యురాలే. మరో ఇద్దరు అక్కలు దివ్య, ప్రియాంక గతంలో దేశానికి ఆడారు. ఇప్పుడు కోచ్‌లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సిస్టర్స్‌కు ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. అక్కలందరూ బాస్కెట్‌బాల్‌ ఎంచుకుంటే.. అతడు మాత్రం ఫుట్‌బాల్‌ క్రీడను ఎంచుకున్నాడు. ప్రస్తుతం అతడు ఢిల్లీ జట్టుకు ఆడుతున్నాడు.

కాగా, వివాహం తర్వాత కూడా తన ప్రతిమ క్రీడాకారిణిగా కొనసాగవచ్చునని ఆమె సోదరి ఆకాంక్ష చెప్పారు. ఆమె తమ కుటుంబంలో ప్రత్యేక వ్యక్తని తెలిపారు. తమకు ఎంతో విలువైన సూచనలు ఇచ్చేదని చెప్పారు. అంతేగాక, మంచి స్నేహితురాలు అని కూడా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+