Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోటీ పరీక్షల ప్రత్యేకం: రీజనింగ్ ప్రాధాన్యత

ఏ పోటీ పరీక్షలో అయినా రీజనింగ్ విభాగం చాలా ముఖ్యమైంది. మరియు తప్పనిసరిది. ఇది ఒక విధంగా ఏ పోటీ పరీక్షకి అయినా పునాది లాంటిది. మిగతా విభాగాలలో కాకుండా, ఈ రీజనింగ్ విభాగంలో ప్రశ్నలు ఒక లాజిక్ పై ఆధారపడి ఉంటాయి. ఆ లాజిక్‌ను అర్థం చేసుకుంటే, ఈ ప్రశ్నలకు సమాధానం చాలా సులభంగా కనుక్కోవచ్చు.

చాలా మంది విద్యార్థుల్లో రీజనింగ్ అనగానే ‘చాలా సులభం/తేలిక' అనే ఒక అభిప్రాయం తమ మదిలో ఉంటుంది. ఇది సహజం. కానీ ఈ అభిప్రాయం కొన్నిసార్లు విద్యార్థుల తుది ఫలితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కావున పోటీ పరీక్షలకు అయ్యే విద్యార్థులు ఏ ఒక్క విభాగంపైనా చిన్న చూపు చూడకూడదు. ఏ ఒక్క విభాగంపై అశ్రద్ధ అలసత్వం ప్రదర్శించకూడదు.

Reasoning(రీజనింగ్) కీలక విభాగంగా ఉన్న ముఖ్య పోటీ పరీక్షలు:

1. Banking (Bank PO/Clerk/SO)
2. SSC (స్టాఫ్ సెలక్షన్ కమిషన్)
3. RRB (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్)
4. CSAT
5. Group-I, II, IV
6. SI/Constables
7. VRO/VRA

Reasoning Topics(రీజనింగ్ విషయాలు)

How to prepare competition tests

రీజనింగ్ విభాగం మూడు ఉప విభాగాలుగా నిర్మించబడి ఉంది.

I. Verbal Reasoning
II. Logical and Analytical Reasoning
III. Non-Verbal Reasoning

I. Verbal Reasoning: వర్బల్ రీజనింగ్‌‌లోని ముఖ్యమైన విషయాలు

1. Coding - Decoding (సంకేత భాష)
2. Analogy (సాదృశ్యము)
a. Alphabet (అక్షర సాదృశ్యము)
b. Number (సంఖ్యా సాదృశ్యము)
c. Word (పద సాదృశ్యము)
3. Alphabet test (అక్షరమాల పరీక్ష)

4. Odd Man Out (భిన్న పరీక్ష)
a. Alphabet Odd Man Out (అక్షర భిన్న పరీక్ష)
b. Number Odd Man Out (సంఖ్యా భిన్న పరీక్ష)
c. Word Odd Man Out (పద భిన్న పరీక్ష)

5. Series (శ్రేణులు)

a. Number Series (సంఖ్యా శ్రేణులు)
b. Letter Series (అక్షర శ్రేణులు)

6. Direcions (దిశ - స్థానము)

7. Blood Relation (రక్త సంబంధాలు)
8. Mathematical Operations (గణిత పరిక్రియలు)
9. Clocks (గడియారాలు)
10. Calendars (కాలచక్రం)
11. Ranking Test (క్రమానుగత శ్రేణి పరీక్ష)
12. Puzzles (సంఖ్యా-పద వినోదం)
13. Seating Arrangement (సీటింగ్ అరెంజ్‌మెంట్)

How to prepare competition tests

II. Logical and Analytical Reasoning(లాజికల్ అండ్ అనలైటికల్ రీజనింగ్)

1. logic based Venn Diagrams (లాజికల్ వెన్ చిత్రాలు)
2. Eligibility Test
3. Syllogism
4. Statement and Assumption (ప్రకటనలు అంచనాలు)
5. Statement and Conclusion (ప్రకటనలు- సారాంశములు)
6. Statement and Argument (ప్రకటనలు-వాదనలు)
7. Statement and Course of Action (ప్రకటనలు -చర్యలు)
8. Data Sufficiency (దత్తాంశ సమృద్ధి)
9. Input - Output

III. Non Verbal Reasoning

1. odd man out (భిన్న చిత్రం ఎంపిక)
2. Figure completion (ఖాళీ గడిని పూర్తి చేయు బొమ్మను గుర్తించుట)
3. Series (క్రమగతిలో సరిపోయే బొమ్మను గుర్తించుట)
4. Analogy (జంట బొమ్మల సంబంధంలో నాల్గవ బొమ్మను గుర్తించుట)
5. Cubes and Dice (ఘనం-పాచిక)
6. Counting Squares, Triangles & Circles
7. Figure Matrix

/feature/general/how-to-prepare-competition-tests-151241.html

1. బ్యాంక్ పరీక్షలు:

బ్యాంక్ పరీక్షల్లో రీజనింగ్ విభాగంలో ప్రశ్నలు ఎక్కువగా లాజికల్ అండ్ అనలైటికల్ రీజనింగ్ పై కేంద్రీకృతమై ఉంటాయి.

a. Verbal Reasoning-30%
b. Logical & Analytical Reasoning -70%

బ్యాంక్ పరీక్షల్లో సాధారణంగా సిల్లాగిసం(Syllogism), Inequalities, Comparisions, Input-Out pur, Data Sufficiency, Eligibility Test, Puzzles, Seating Arrangements, Statement - Arguments, Assumptions, Course of Action, Conclusions etc. అంశాలపై దృష్టి సారించాలి. ఈ విభాగాలను రోజువారిగా సాధన చేయాలి. వీలైనన్ని ఎక్కువ మాదిరి ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.

పరీక్ష ఆన్‌లైన్/కంప్యూటర్ పద్ధతిలో ఉంటుంది కావున ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్‌లు ఎక్కువగా సాధన చేయాలి. ఒక ప్రశ్నకు సమాధానం ఇంచుమించుగా 36 సెకండ్లలో వచ్చేట్లుగా సాధన చేయాలి.

How to prepare competition tests

2. స్టాఫ్ సెలక్షన్ కమిషన్

ఈ పరీక్షల్లో రీజనింగ్ విభాగం చాలా తేలికపాటి ప్రశ్నలతో ఉంటుంది.

a. వర్బల్ రీజనింగ్ -60%
b. లాజికల్ అండ్ అనలైటికల్ -20%
c. నాన్-వర్బల్ రీజనింగ్-20%

ప్రతి అంశంపై అవగాహన తప్పనిసరి మాది ప్రశ్నలను ఎక్కువగా సాధన చేస్తే మంచి ఫలితాన్ని రాబట్టవచ్చు. నాన్ వర్బల్ విభాగాన్ని కొంత జాగ్రత్తగా సాధన చేయాలి.

- హర్షవర్ధన్ ఎర్రా

SI/Groups/CSAT పరీక్షల్లో రీజనింగ్‌పై విశ్లేషణ వచ్చేవారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+