వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్ ఆడిన బిత్తిరి సత్తి.. ఫన్నీ బౌలింగ్‌తో అదుర్స్ (ఫోటోలు)

ఎవిన్ ఎంటర్టైన్ మెంట్స్ మరియు తెలంగాణ స్త్రీ శక్తి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ కార్పోరేటర్స్ క్రికెట్ లీగ్ నవంబర్ 30 నుంచి ప్రారంభమైంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : క్షేత్రస్థాయిలో యువకుల్లో దాగున్న క్రికెట్ ప్రతిభను వెలికితీసేందుకు ఎవిన్ ఎంటర్టైన్ మెంట్స్ మరియు తెలంగాణ స్త్రీ శక్తి సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్ కార్పోరేటర్స్ క్రికెట్ లీగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 30 నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది.

చరిత్రలో మొదటిసారిగా:

చరిత్రలో మొదటిసారిగా:

క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవానికి పెద్దపల్లి మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు వివేక్, మాజీ మంత్రి వినోద్, వీ6 పాపులర్ యాంకర్ బిత్తిరి సత్తి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. చరిత్రలో మొదటిసారిగా గ్రేటర్ పరిధిలోని కార్పోరేటర్ల ప్రాతినిధ్యంలో ఆయా డివిజన్ల క్రికెట్ టీమ్స్ ఈ లీగ్ లో పాల్గొంటున్నాయని నిర్వాహుకులు తెలిపారు.

సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా బిత్తిరి సత్తి :

సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా బిత్తిరి సత్తి :

యువకుల్లో దాగున్న క్రికెట్ ప్రతిభను వెలికితీయడానికి ఇదొక మంచి ప్లాట్ ఫామ్ గా ఉపయోగపడుతుందని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. యువ క్రికెటర్ల ప్రతిభను మరో మెట్టు ఎక్కించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు.

లీగ్ ప్రారంభోత్సవంలో వీ6 పాపులర్ యాంకర్ బిత్తిరి సత్తిరి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. తనదైన శైలిలో పలువురు ప్రముఖులకు బౌలింగ్ చేసి ఆహుతులను ఆకట్టుకున్నాడు.

మొత్తం 2100 మంది ప్లేయర్స్:

మొత్తం 2100 మంది ప్లేయర్స్:

గ్రేటర్ పరిధిలో ఉన్న మొత్తం 150మంది కార్పోరేటర్స్ ఈ లీగ్ లోని క్రికెట్ టీమ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఒక్కో టీమ్ లో 15మంది ప్లేయర్స్ తో చొప్పున మొత్తం 2100మంది ప్లేయర్స్ ఈ టోర్నీలో పాలుపంచుకోబుతున్నారు.

టాస్ వేసి ప్రారంభిస్తున్న వివేక్ :

టాస్ వేసి ప్రారంభిస్తున్న వివేక్ :

హైదరాబాద్ కార్పోరేటర్స్ క్రికెట్ లీగ్ లో తొలి మ్యాచ్ ను మాజీ ఎంపీ వివేక్ టాస్ వేసి ప్రారంభించారు. అనంతరం బిత్తిరి సత్తి, వివేక్, వినోద్.. సరదాగా బ్యాటింగ్ చేశారు.

English summary
We the team of Awin Entertainments along with Telangana Stree Shakthi we are doing a Cricketing League called HCCL – Hyderabad Corporator’s Cricket League. For the first time ever in the history of Sports all the Corporator’s in Greater Hyderabad Circle are taking a part and representing a Cricket team from their Elected Division area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X