హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ ప్లేబాయ్ క్లబ్‌కు చిక్కులు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్లేబాయ్ క్లబ్‌కు చిక్కులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమైన స్థితిలో పోలీసులు మాట మార్చి క్లబ్ పేరు మార్చుకోవాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. క్లబ్ ఇప్పుడు మొదలైంది కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 2012 డిసెంబర్ 21వ తేదీన దానికి అనుమతి వచ్చిందని హైదరాబాదు పోలీసులు ఇంత కాలం చెబుతూ వచ్చారు. క్లబ్ మరమ్మతులు చేపట్టి, లైసెన్స్ పొందినప్పటి షరతులతో క్లబ్‌ను నడపడానికి నోవాటెల్ - హెచ్ఐసిసి ప్లేబాయ్‌కు కాంట్రాక్టుకు ఇచ్చిందని కూడా వారు చెబుతున్నారు.

విందు చేసే మహిళా సర్వర్లు, ఇబ్బంది పెట్టే దుస్తులు, అసభ్యత ఏమీ ఉండవని ప్లేబాయ్ సంస్థ స్పష్టంగానే చెప్పింది. అయితే, క్లబ్ పేరు మార్చుకోవల్సిందేనని తాజాగా పోలీసులు ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ఈ క్లబ్ నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అంటూనే పోలీసులు క్లబ్ నిర్వహణపై 21 నిబంధనలను విధించింది.

క్లబ్‌లో బన్నీ దుస్తులతో మహిళా సర్వర్లు ఉండరాదని తేల్చిచెప్పారు. సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ప్లేబాయ్ క్లబ్ వ్యవహారాలపై ఎట్టకేలకు మాట్లాడారు. అందరి నుండి వస్తున్న అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని క్లబ్ పేరు మార్చుకుంటే మంచిదని యాజమాన్యానికి సూచించామని చెప్పారు.
ప్లేబాయ్ క్లబ్‌కు ప్రపంచవ్యాప్తంగా ‘ఎ' సర్ట్ఫికేట్ ముద్ర ఉన్నా హైదరాబాద్‌లో మాత్రం ఎలాంటి అశ్లీలతకు తావులేకుండా నిర్వహిస్తామని ప్లేబాయ్ ఇండియా లైఫ్ స్టయిల్ ఎండి పరాగ్ సంఘవి ఇటీవల చెప్పారు.

అయితే, ఆ పేరు వినగానే అందరిలో విచిత్రమైన భావన కలుగుతుందని, దాంతో అనుమానాలు మొదలవుతాయని పోలీసులు అంటున్నారు. హైదరాబాద్‌లో ఉన్న అనేక రకాల క్లబ్‌ల మాదిరి నిబంధనలు పాటిస్తూ దానిని నిర్వహించుకోవచ్చని, అంతే తప్ప అందర్నీ ఆకర్షించే రీతిలో క్లబ్‌ను నిర్వహించడాన్ని తాము అంగీకరించేది లేదని చెబుతున్నారు. క్లబ్‌ను రాత్రి 8 గంటల నుండి ఉదయం 2 గంటల వరకూ నిర్వహించుకోవచ్చని, అయితే ఇందుకు సంబంధించి ఆసక్తికరమైన హోర్డింగ్‌లు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించరాదని కూడా స్పష్టం చేశారు.

Hyderabad Play Boy club in trouble?

ఎపి గేమింగ్ యాక్ట్ 1947 పరిధిలోని ఎలాంటి ఆటలకు తావివ్వరాదని, డ్యాన్స్ ప్రోగ్రాంలను నిర్వహించరాదని, అశ్లీలాన్ని ప్రదర్శిస్తూ పోస్టర్లు ఇతరత్రా ఉపయోగించరాదని కూడా స్పష్టం చేశారు. పత్రికల్లో కూడా అలాంటి ప్రకటనలు ఇవ్వరాదని, సిసిటివి కెమెరాలతో పరిసరాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించామని పోలీసులు చెబుతున్నారు. అలాగే సరిపడా వెలుగు, కూర్చునేవారికి అనువైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు.

మహిళా సంఘాలు, హిందూ సంస్థలు, విద్యార్ధి సంఘాల నుండి వచ్చిన వ్యతిరేకతపై పరాగ్ సంఘవితో పాటు ప్లేబాయ్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మితేష్ మెహతా, డైరెక్టర్ గౌరవ్ బకాయా, ప్రమోటర్ సిమ్మికాంటే అనుమానాలను నివృత్తి చేశారు. ఎలాంటి అశ్లీలతకు తావులేకుండా భాగ్యనగర వైభవానికి తగ్గట్టు, ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా ప్లేబాయ్ సేవలను అందిస్తుందని పరాగ్ సంఘవి వివరించారు. అమెరికా ప్లేబాయ్ క్లబ్ గురించి తెలిసిన వాళ్లు అక్కడి సంప్రదాయం ఇక్కడ కూడా కొనసాగుతుందనే ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ముమ్మాటికీ ఆ సంప్రదాయం ఇక్కడ కనిపించబోదని తెలిపారు.

బన్నీలు, వెయిట్రస్‌లు, టీజింగ్ క్వీన్‌లు ఈ క్లబ్ ప్రత్యేకత అయినా, ఇక్కడ మాత్రం అలాంటి సందడి ఉండదని అన్నారు. భారతీయ విలువలు, తెలుగువారి సంప్రదాయానికి ఎలాంటి భంగం వాటిల్లదని, అందరూ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తారని సంఘవి వివరించారు.

English summary

 
 Hyderabad play boy club is facing trouble from police, as protests are seen against it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X