సర్వే: హైదరాబాద్‌ను ఇలా చూశామా (పిక్చర్స్)

హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా మంగళవారంనాడు హైదరాబాదు రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. హైదరాబాదులో ఉదయం 7 గంటలకు సర్వే ప్రారంభమైంది. తొలుత మందకొడిగా సాగినప్పటికీ ఆ తర్వాత ఊపు అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 30 శాతం సర్వే పూర్తయింది.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేకు అందరూ సహకరించాలని డీజీపీ అనురాగ్ శర్మ కోరారు. ఈ ఉదయం సమగ్ర సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్లకు అనురాగ్ శర్మ తన కుటుంబ సభ్యుల వివరాలను తెలియజేశారు.

హైదరాబాదులోని తెలంగాణ మంత్రులు నాయని నర్సింహా రెడ్డి, జగదీష్ రెడ్డి, తదితరులు తమ కుటుంబ వివరాలను అందించారు. హైదరాబాదు పోలీసు కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి కూడా తన కుటుంబ వివరాలను అందించారు. హైదరాబాదులోని హోటళ్లు, సంస్థలు, పెట్రోల్ బంకులు అన్నీ మూసి ఉన్నాయి.

హైదరాబాదులో సర్వే..

హైదరాబాదులో సర్వే..

సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా హైదరాబాదులోని బస్సు డిపో ఇలా నిర్మానుష్యంగా కనిపించింది. చాలా వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

అన్నీ మూత...

అన్నీ మూత...

హైదరాబాదులోని దుకాణాలన్నీ తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా మూత పడ్డాయి. ఇలా షట్టర్లు మూతపడ్డాయి.

రోడ్డు నిర్మానుష్యం

రోడ్డు నిర్మానుష్యం

హైదరాబాదులో ఇంతటి నిశబ్దం ఎప్పుడూ చూడనట్లుగా రోడ్లు బిక్కవోయాయి. దుకాణాలు, సంస్థలు మూతపడి రోడ్ల మీద మనుషులే లేని స్థితి.

అక్కడక్కడా ఇలా...

అక్కడక్కడా ఇలా...

హైదరాబాదు రోడ్లపై అక్కడక్కడ ఇలా కొన్ని వాహనాలు తిరుగుతూ కనిపించాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాదు రోడ్లు మంగళవారంనాడు సేద తీరాయి.

వివరాలు నమోదు చేసుకుంటూ...

వివరాలు నమోదు చేసుకుంటూ...

సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇలా వివరాలను సేకరిస్తున్న ఎన్యుమరేటర్. ఆధార్ కార్డును తీసుకుని నమోదు చేసుకుంటున్నాడు.

హైదరాబాదు ఎప్పుడైనా ఇలా ఉందా..

హైదరాబాదు ఎప్పుడైనా ఇలా ఉందా..

హైదరాబాదు ఎప్పుడైనా ఇలా ఉందా, ఇటువంటి అరుదైన దృశ్యాన్ని బహుశా హైదరాబాదీలు ఎప్పుడూ చూసి ఉండరు.

మర్చిపోలేదు ఇలా...

మర్చిపోలేదు ఇలా...

తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. హోర్డింగులు కూడా పెట్టింది. మరిచిపోవద్దని ఇంట్లోనే ఉండాలనే ప్రచారానికి ఇలా రోడ్లు ఖాళీగా కనిపించాయి.

ఈ శునకానిదెంత హుషారో...

ఈ శునకానిదెంత హుషారో...

తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా హైదరాబాదు రోడ్లు ఖాళీగా కనిపించాయి. ఎప్పుడూ భయంగా రోడ్డు దాటే శునకాలు కూడా ఇలా ఆనందంగా స్వేచ్ఛగా రోడ్డుపై తిరుగాడుతూ..

ఇంత నిర్మానుష్యమా...

ఇంత నిర్మానుష్యమా...

రోడ్డు ఇలా ఖాళీగా ఉంటే స్వేచ్ఛగా, నిర్భయంగా నడిరోడ్డుపై నడవలచ్చు. ఇలాంటి వాతావరణం ఎప్పుడైనా హైదరాబాదులో ఉందా...

ఏది చూసినా ఖాళీయే...

ఏది చూసినా ఖాళీయే...

కుటుంబ సమగ్ర సర్వే సందర్భంగా ఏ రోడ్డు చూసినా హైదరాబాదులో ఖాళీగానే కనిపించింది. రోడ్లపై ఒకటో ఆరో వాహనాలు తిరుగుతూ కనిపించాయి.

చార్మినార్ ఇలా తొంగి చూస్తూ...

చార్మినార్ ఇలా తొంగి చూస్తూ...

ఎప్పుడూ క్రిక్కిరిసి ఉండే చార్మినార్ ప్రాంతం ఇలా నిర్మానుష్యంగా కనిపించింది. ఎంతో దూరం నుంచి చార్మినార్ కనిపిస్తోంది ఇలా...

చార్మినార్ సాక్షిగా...

చార్మినార్ సాక్షిగా...

చార్మినార్ వద్ద తొక్కిసలాట, వాహనాల రొదలు, కాలు తీసి కాలు వేయడానికి వీలు లేని రద్దీ రోజూ... కానీ మంగళవారం ఇలా..

కొనేవారు ఉంటారా...

కొనేవారు ఉంటారా...

ఇలా అమ్మడానికి సైకిళ్ల మీద బయలుదేరిన గాలిబుడగల చిరు వ్యాపారాలకు నిరాశ తప్పినట్లు లేదు. చార్మినార్ ప్రాంతంలో వారు తప్ప మరొకరు కనిపించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+