19ఏళ్లకే సీఏ: చరిత్ర సృష్టించిన హైదరాబాద్ వాసి

హైదరాబాద్: పిన్న వయసులోనే సీఏ పాసై అరుదైన ఘనత సాధించాడు హైదరాబాదీ యువకుడు నిశ్చల్‌ నారాయణమ్‌. 19 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఈ సందర్భంగా అతడిని పలు సంస్ధల ప్రతినిధులు బుధవారం ఘనంగా సన్మానించారు.

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఆండియా, డెలాయిట్‌ ఇంటర్నేషనల్‌ ఆడిట్‌ ఫర్మ్‌ల ఆధ్వర్యంలో ఎర్రమంజిల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీఏఐ వైస్‌ చైర్మన్‌ ప్రకాష్‌ చోప్డా, కౌన్సిల్‌ సభ్యుడు నరేష్‌ గెల్లీ ఆయనకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

వివిధ అంశాల్లో నిశ్చల్ సాధించిన బహుమతులు:

మెమోరి విభాగంలో 'యంగెస్ట్ డబుల్ గిన్నిస్ వర్లడ్ రికార్డ్ హోల్డర్' బహుమతిని పొందాడు.

నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ నిర్వహించిన '7 బ్రిలియంట్స్ బ్రేన్స్ ఆఫ్ ది వరల్డ్స్'లో ఒకరిగా నిలిచాడు.

2008 నేషనల్ ఛైల్డ్ అవార్డ్ ఫర్ ఎక్సెప్షనల్ అఛీవ్‌మెంట్ గోల్డ్ మెడల్ సాధించాడు.

 చరిత్ర సృష్టించిన హైదరాబాద్ వాసి: 19ఏళ్లకే సీఏ

చరిత్ర సృష్టించిన హైదరాబాద్ వాసి: 19ఏళ్లకే సీఏ


హైదరాబాద్ వాసి అయిన నిశ్చల్‌ నారాయణమ్‌ ఎన్‌సీఎస్‌ గ్రూప్‌ చైర్మన్‌ నారాయణమ్‌ నాగేశ్వరరావు, నిశ్చల్స్‌ స్మార్ట్‌ లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ ఎండీ పద్మావతిలు దంపతులకు రెండో సంతానం. తొమ్మిదేళ్ల వయసులో నిశ్చల్‌కు గణిత శాస్త్రంపై ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు.

 చరిత్ర సృష్టించిన హైదరాబాద్ వాసి: 19ఏళ్లకే సీఏ

చరిత్ర సృష్టించిన హైదరాబాద్ వాసి: 19ఏళ్లకే సీఏ


దీంతో జ్ఞాపకశక్తిలో రెండు సార్లు గిన్నిస్‌బుక్‌ రికార్డ్స్‌లోకెక్కారు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో అతి చిన్న వయసులోనే డిగ్రీ, పీజీలను పూర్తిచేశాడు. మ్యాథ్స్‌ ల్యాబొరేటరీని కూడా తయారుచేశారు.

 చరిత్ర సృష్టించిన హైదరాబాద్ వాసి: 19ఏళ్లకే సీఏ

చరిత్ర సృష్టించిన హైదరాబాద్ వాసి: 19ఏళ్లకే సీఏ


తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నిశ్చల్ నేడు ప్రపంచ వ్యాప్తంగా అతి పిన్న వయసులో సీఏ పాసై అయిన వ్యక్తిగా చరిత్ర సృష్టించి, తన సత్తాను ప్రపంచానికి చాటాడు.

చరిత్ర సృష్టించిన హైదరాబాద్ వాసి: 19ఏళ్లకే సీఏ

చరిత్ర సృష్టించిన హైదరాబాద్ వాసి: 19ఏళ్లకే సీఏ


ఈ కార్యక్రమంలో డెలాయిట్‌ ఇంటర్నేషనల్‌ ఆడిట్‌ ఫర్మ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరన్‌, ఓయూ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ మాజీ చైర్మన్‌ పురుషోత్తమరావు, నిశ్చల్‌ తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+