ఐబిపిఎస్ (బ్యాంకింగ్): కొత్త పరీక్షా విధానం, ప్రిపేర్ ఎలా?

2015-16 సంవత్సరానికి గాను ఐబిపిఎస్ (5) కొత్త పరీక్ష విధానాన్ని విడుదల చేసింది. అది విడుదల చేసిన తాత్కాలిక క్యాలెండర్ ప్రకారం ఆఫీసర్స్, క్లర్క్ పరీక్షకు ఇక రెండంచెల విధానం ఉండబోతున్నది. రెండో అెంచ పరీక్షకు అర్హత సాధించాలంటే, మొదటి అంచెలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ రెండు పరీక్షలను కూడా ఒక నెల వ్యవధిలో నిర్వహిస్తారు. మొదటి అంచె పరీక్షలో ప్రశ్నల సంఖ్య తక్కువగా ఉంటుంది. పూర్తి స్థాయి పరీక్షా విధానాన్ని, ఐబిపిఎస్ వారు తమ తదుపరి నోటిఫికేషన్‌లో వెల్లడిస్తారు.

ఈ రెండంచెల పరీక్షా విధానాన్ని ప్రస్తుతం సివిల్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (సిజిఎల్), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (గ్రేడ్ బి ఆఫీసర్స్), నాబార్డ్ (గ్రేడ్ ఎ, గ్రేడ్ బి ఆఫీసర్స్), ఎఎస్ఆర్‌బి (అగ్రికల్చర్) పరీక్షల్లో పాటిస్తున్నారు.

ఎందుకీ మార్పు....

గత మూడేళ్లుగా బ్యాంకింగ్ రంగంలో వేలాది ఉద్యోగాల భర్తీ జరిగింది. ఇక ముందు కూడా వేల సంక్యలో ఉద్యోగాలు నిరుద్యోగుల కోసం నిరీక్షిస్తున్నాయి. కాబట్టి లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారు.

మొదటి అంచెలో ప్రాథమిక పరీక్ష నిర్వహించి దానిలోని ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రధాన పరీక్ష నిర్వహిస్తారు. దానిలో ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులు మాత్రమే మౌఖిక పరీక్షకు అర్హత సాధిస్తారు. ఈ రెండంచెల విధానం ద్వారా అభ్యర్థుల వడపోత అనేది ప్రాథమిక దశలో జరుగుతుంది.

మౌఖిక పరీక్షకు ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల తుది ఫలితాలు త్వరగా వెలువడుతాయి. బ్యాంక్ పరీక్షకు తీవ్ర స్థాయిలో సంసిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ రెండంచెల పరీక్షా విధానం ఓ సువర్ణావకాశం.

 IBPS Baning: new exam system, how to prepare

పరీక్ష ఎలా ఉండబోతుంది....

పరీక్షా విధానం, సిలబస్ కోసం మనం ఐపిపిఎస్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసేవరకు వేచి చూడాలి. కానీ ప్రాథమిక అంచనా ప్రకారం పరీక్షల నమూనా ఇలా ఉంటుంది.

CINE po/MT - V - Preliminary examanination - Main examaination

CINE clerk - V - Preliminary examanination - Main examaination

ప్రాథమిక పరీక్షలో పరిమిత సంఖ్యలో ప్రశ్నలు, తక్కువ కాలవ్యవధి ఉండవచ్చు.

సన్నద్ధం కండి ఇలా...

పరీక్ష విధానం మారినా పరీక్ష మాత్రం ప్రస్తుతం ఉన్న రాత పరీక్ష స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. మొదటి అంచెలో ప్రశ్నలు ఇంచు మించు ఇదే స్థాయిలో ఉండి, రెండవ అంచెలో కొంచెం కఠిన పరీక్షలు అడిగే అవకాశ ఉంటుంది. అభ్యర్థులు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా పరిక్షకు 8 నెలల వ్యవధి ఉంది. కాబట్టి అభ్యర్థులు ప్రణాళికా బద్దంగా సన్నద్ధం అయితే, బ్యాంక్ ఉద్యోగం పొందడం చాలా సులభం.

అన్ని బ్యాంక్ పరీక్షల్లో సాధారణంగా ఐదు విభాగాలు ఉంటాయి -

1. రీజనింగ్
2. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (అరిథ్‌మెటిక్, డాటా ఇంటర్‌ప్రిటిషన్)
3. జనరల్ ఇంగ్లీష్
4. జనరల్ అవేర్‌నెస్
5. కంప్యూటర్ నాలెడ్జ్

బ్యాంక్ పరీక్షల్లో విజయం సాధించాలంటే పై విభాగాల మీద పట్టు సాధించాలి. ప్రతి అంశాన్నీ ప్రాథమిక స్థాయి నుంచి క్షుణ్నంగా నేర్చుకోవాలి.

వీలైనన్ని ఎక్కువ మాదిరి ప్రశ్నలను సాధన చేయాలి. జనరల్ అవేర్‌నెస్ విభాగంపై శ్రద్ధ వహించాలి. వార్తాపత్రికలను, సోషల్ నెట్‌వర్క్ సైట్లను,, మాగజైన్స్‌ను, మొదలైనవాటిని క్రమం తప్పకుండా అనుసరించాలి.

ఒక్క పక్కా ప్రణాళిక, దృఢమైన సంకల్పం, సిలబస్‌పై పూర్తి అవగాహన ఉండి, క్రమం తప్పకుండా మాదిరి ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేస్తే బ్యాంక్ ఉద్యోగం మీ గుమ్మం ముందు వాలుతుంది.

- హర్షవర్ధన్ ఎర్రా
రచయిత బ్యాంకింగ్ రంగంలో నిపుణుడు

(వచ్చే వారం రీజినింగ్‌కు ఎలా ప్రిపేర్ కావాలి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+