ప్రపంచ తొలి సెక్స్ థీమ్ పార్క్ ఇదే: షాకింగ్ విశేషాలు!
బ్రెజీలియా: ఇప్పటి వరకు అనేక థీమ్ పార్కులు చూసుకుంటాం. వాటి గురించి తెలుసుకుని ఉంటాం. ఇప్పుడు ఓ కొత్త రకం అంతర్జాతీయ పార్కు రాబోతోంది. అది కూడా అర్ధనగ్న నృత్యాలతో కనువిందు చేసే కార్నివాల్ డ్యాన్సర్లకు ప్రసిద్ధి చెందిన బ్రెజిల్‌లో.
ఇప్పటికే ఈ పార్కు నిర్మాణ పనులు ప్రారంభించిన నిర్వాహకులు దీనికి 'ఎరోటికా ల్యాండ్' అని పేరు కూడా పెట్టేశారు. ఇందులో ప్రత్యేకత ఏమీటంటే.. అన్ని రకాల గేమ్స్ కూడా సెక్స్ థీమ్‌తోనే ముడివడి ఉంటాయి. నేకెడ్ పూల్‌లోకి పూర్తి నగ్నంగా ఉన్న వారినే అనుమతిస్తారు. అన్ని ఆటలు కూడా స్త్రీ, పురుషుల్లో కామోద్రేకాన్ని పెంచేవిగా ఉంటాయి.
వైబ్రేషన్ కలిగించే '7డి' థియేటర్, సెక్స్ షాప్ సౌకర్యాలు ఉంటాయి. కామోద్రేకాలకు ఉత్ప్రేరకాలుగా పనిచేసే మద్యం, ఆహార పదార్థాల హోటల్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. గోగో గర్ల్స్, బాయ్స్ (రేవ్ పార్టీల్లో నృత్యం చేసేవారు) కూడా ఉంటారు. బహిరంగ సెక్స్‌ను మాత్రం అనుమతించరు. సెక్స్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్న జంటలు ఇదే థీమ్ పార్క్‌లో ఉండే హోటల్ గదులను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ పార్క్‌లోకి పెద్దలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ప్రవేశ రుసుమును వంద డాలర్లుగా నిర్ణయించారు. సావో పావులోకి రెండు గంటల ప్రయాణ దూరంలోని పిరాసికబా నగరానికి సమీపంలో నిర్మిస్తున్న ఈ థీమ్ పార్క్ 2018లో ప్రారంభంకానుంది.
SEX theme park to open in Brazil, but there’s no sex allowed https://t.co/eVQEmtykXO pic.twitter.com/TdhuII5FAw
— Daily Express (@Daily_Express) 4 May 2016
కాగా, ఇలాంటి థీమ్ పార్క్‌ను ఏర్పాటు చేయడం వల్ల వ్యభిచారం పెరుగుతుందంటూ క్రిస్టియన్ సోషలిస్ట్ పార్టీ సభ్యులు, పిరాసికబా నగర సమితి నాయకులు లాంటి కొంత మంది ఈ థీమ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. తాము సేవ్ సెక్స్‌ను మాత్రమే ప్రోత్సహిస్తామని, నన్స్ లాంటి వారిని అసలు అనుమతించమని ప్రాజెక్ట్ లీడర్ మాథ్యూ ఎర్లర్ తెలిపారు.
బైబిల్ కాలం నాటి 'సోడమ్, గొమోరా' నగరాలను సష్టించడమే తమ థీమ్ పార్క్ వెనకనున్న లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. క్రీస్తుకాలం నాటి కథల థీములతో అనేక పెద్దల పార్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు తాము మాత్రం సెక్స్ థీమ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తే తప్పేముందని ఎర్లర్ ప్రశ్నిస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications