ఉత్సాహంగా సాగుతున్న చిత్రోత్సవం(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలో19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం కార్యక్రమం చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన 13 సినిమా ధియేటర్లలో ప్రదర్శించే సుమారు 150 దేశాలకు చెందిన సినిమాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివస్తున్నారు.

మొత్తానికి చిన్ని సినిమా పండుగను విద్యార్థులు, చిన్నారులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహాభరితంగా జరుపుకుంటున్నారు. నవంబర్ 14వ తేదీన శిల్పకళావేదికలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ బాలల చిత్రోత్సవ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ శాఖలు భారీ ఏర్పాట్లు చేశాయి.

నగరంలోని 13 సినిమా ధియేటర్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిమిషం మొదలుకుని రెండు గంటల విడిది గల వివిధ దేశాలకు చెందిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. నగరానికి చెందిన చిన్నారులతో పాటు వివిధ దేశాల నుంచి ప్రతినిధులుగా హజరైన బాల మేధావులు, చిత్రాల నిర్మాణతలు, బాలసాహితీవేత్తలంతా ఒక వేదికపైకి వచ్చారు.

సినిమా రంగంలో ముఖ్యంగా చిన్నారులను ప్రభావితం చేసే చిత్రాలు, వారిలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎలాంటి సినిమాలు రావాలన్న అంశంపై పరస్పరం సభలు, సమావేశాలు, ఇష్టాగోష్ఠిలు, సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు.

ఇలా ఉండగా, రవీంద్రభారతి, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంతో పాటు మాదాపూర్‌లోని శిల్పకళావేదిక, హరిహరకళాభవన్ వంటి ప్రధాన సాంస్కృతిక వేదికలపై వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఇస్తున్న సాంస్కృతిక ప్రదర్శనలు ఇతర దేశ, రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వారిని భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆకర్షితులను చేస్తున్నాయి.

బాలల చిత్రోత్సవంలో ముఖేష్ ఖన్నా

బాలల చిత్రోత్సవంలో ముఖేష్ ఖన్నా

హైదరాబాద్ నగరంలో19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం కార్యక్రమం చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన 13 సినిమా ధియేటర్లలో ప్రదర్శించే సుమారు 150 దేశాలకు చెందిన సినిమాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివస్తున్నారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

మొత్తానికి చిన్ని సినిమా పండుగను విద్యార్థులు, చిన్నారులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహాభరితంగా జరుపుకుంటున్నారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

నవంబర్ 14వ తేదీన శిల్పకళావేదికలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ బాలల చిత్రోత్సవ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ శాఖలు భారీ ఏర్పాట్లు చేశాయి.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

నగరంలోని 13 సినిమా ధియేటర్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిమిషం మొదలుకుని రెండు గంటల విడిది గల వివిధ దేశాలకు చెందిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

ఇందుకు పాఠశాలల నుంచి విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక రవాణా సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

నగరానికి చెందిన చిన్నారులతో పాటు వివిధ దేశాల నుంచి ప్రతినిధులుగా హజరైన బాల మేధావులు, చిత్రాల నిర్మాణతలు, బాలసాహితీవేత్తలంతా ఒక వేదికపైకి వచ్చారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

సినిమా రంగంలో ముఖ్యంగా చిన్నారులను ప్రభావితం చేసే చిత్రాలు, వారిలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎలాంటి సినిమాలు రావాలన్న అంశంపై పరస్పరం సభలు, సమావేశాలు, ఇష్టాగోష్ఠిలు, సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

నగరంలోని ప్రధాన సాంస్కృతిక వేదికలపై వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఇస్తున్న సాంస్కృతిక ప్రదర్శనలు ఇతర దేశ, రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వారిని భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆకర్షితులను చేస్తున్నాయి.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

అంతర్జాతీయ స్థాయిలో బాలల స్థితిగతులు, విద్యా ప్రమాణాలు తెలుసుకోడానికి చిత్రోత్సవాలు దోహదపడతాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి చంద్రశేఖర్‌రావు అన్నారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రదర్శిస్తున్న 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్స్రవాలలో భాగంగా మంగళవారం 16 చిత్రాలను ప్రదర్శించారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం రవీంద్రభారతిలో న్యూజెన్‌స్కూల్ బాలలు ప్రదర్శించిన మహిషాసుర మర్దిని, నల్గొండ బాలభవన్ చిన్నారులు ప్రదర్శించిన లంబాడా నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

పయొనీర్ కానె్సప్ట్ స్కూలు బాలలు బతుకమ్మ అంశంతో ప్రారంభించారు. నాగార్జున స్కూలు రాజస్థానీ నృత్యం, మాదాపూర్ జడ్‌పి స్కూలు బాలలు శివపార్వతి అంశాన్ని, రాజేంద్రనగర్ ప్రభుత్వ స్కూలు విద్యార్థులు జననీ జన్మభూమి అంశాన్ని ప్రదర్శించారు.

బాలల చిత్రోత్సవం

బాలల చిత్రోత్సవం

నారాయణ స్కూలు విద్యార్థులు గోవింద బోలో అంశం, ఆదిలాబాద్ జిల్లా బాల కేంద్రం బాలలు తయూమ్ తయూమ్ అంశాన్ని, ప్రగతి విద్యానికేతన్ విద్యార్థు దేశభక్తి గీతాన్ని ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం నార్వే దేశానికి సంబంధించిన ‘ఆపరేషన్ ఆర్టిక్' చిత్రాన్ని ప్రదర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+