రాష్ట్ర విభజన: టిలో సంబరాలకి సన్నద్ధం (పిక్చర్స్)

హైదరాబాద్: ఆవిర్భావ ఉత్సవాలకు తెలంగాణ సన్నద్ధమవుతోంది. జూన్ 2న ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో 1వ తేదీన అర్ధరాత్రి కొత్త రాష్ట్రానికి స్వాగతం పలికేందుకు ఆయా పార్టీలు, తెలంగాణ ప్రజలు, వివిధ సంఘాల నేతలు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వారంపాటు ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం, తెరాస శ్రేణులు ప్లాన్ చేశాయి.

ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలు దాదాపు పూర్తయ్యాయి. మానవ వనరుల పంపకాలూ దాదాపు చివరి దశకు చేరాయి. విడిపోతున్న రాష్ట్రాల్లో ఎవరికివారు కొత్త జీవితం ఆరంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కావడానికి కొద్ది గంటలే మిగిలి ఉంది. అప్పాయింట్ డే అయిన జూన్ 2 ముహూర్తానికి కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో విభజన ప్రక్రియను అటు కేంద్రం, ఇటు రాష్ట్ర అధికారులు మరింత వేగవంతం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలోని 18మంది పెద్దలను లాటరీలో శుక్రవారం పంచేశారు. లాటరీ ద్వారా అటువారు ఇటుకి, ఇటువారు అటుకీ చేరక తప్పడం లేదు. 29వ రాష్ట్రంగా ఏర్పడుతున్న తెలంగాణ రాష్ట్రావతరణ సంబురాలకు శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. తెలంగాణ తనదైన రాజముద్రనూ ఏర్పాటు చేసుకుంది. జూన్ 2న నిర్వహించే ఉత్సవాలకు పరేడ్ మైదానాన్ని తెరాస ఎంచుకున్నారు.

తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరేడ్ గ్రౌండ్ చేరుకుని ఉత్సవాల్లో పాల్గొంటారు.

 తెలంగాణ

తెలంగాణ

పరేడ్ గ్రౌండ్‌ను అధికారులు పెద్ద ఎత్తున ముస్తాబు చేస్తున్నారు. ఆ రోజు ప్రదర్శించనున్న సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీసుల పరేడ్ తదితర కార్యక్రమాల రిహార్సల్స్ శుక్రవారం నిర్వహించారు.

తెలంగాణ

తెలంగాణ

పరేడ్ మైదానంలో ఏర్పాట్లను శుక్రవారం ఉదయం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తదితర ఉన్నతాధికారులు పరిశీలించారు.

 తెలంగాణ

తెలంగాణ

పరేడ్‌గ్రౌండ్ లోపల, పరిసరాల్లో భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. నగరంలోని ప్రధాన కూడళ్లకు జూన్ ఒకటో తేదీ నుంచి లైటింగ్ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం నిర్ణయించింది.

తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ మలి దశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టీజేఏసీ 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కు వద్ద ఆట-పాట-మాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

తెలంగాణ

తెలంగాణ

అర్ధరాత్రి 12 గంటలకు తెలంగాణ జెండా ఎగురవేసి, బాణా సంచా కాల్చి సంబురాలను జరపనుంది. 2వ తేదీ ఉదయం జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ఊరేగింపులు, సదస్సులు నిర్వహిస్తారు. సాయంత్రం అన్ని జిల్లాల్లోని అమరవీరుల స్థూపాల వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పిస్తారు.

 తెలంగాణ

తెలంగాణ

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం శుక్రవారం గన్‌పార్కు వద్దకు వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు.

తెలంగాణ

తెలంగాణ

భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటామని సిపిఎం ప్రకటించింది.

 తెలంగాణ

తెలంగాణ

జూన్ 2న పార్టీ జెండా ఎగురవేసి రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకుంటామని సిపిఐ వెల్లడించింది. తెలంగాణ తెలుగుదేశం కూడా ఉత్సవాలు జరపనుంది.

తెలంగాణ

తెలంగాణ

ఆవిర్భావ ఉత్సవాలకు తెలంగాణ సన్నద్ధమవుతోంది. జూన్ 2న ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో 1వ తేదీన అర్ధరాత్రి కొత్త రాష్ట్రానికి స్వాగతం పలికేందుకు ఆయా పార్టీలు, తెలంగాణ ప్రజలు, వివిధ సంఘాల నేతలు సిద్ధమయ్యారు.

తెలంగాణ

తెలంగాణ

రాష్ట్రవ్యాప్తంగా వారంపాటు ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం, తెరాస శ్రేణులు ప్లాన్ చేశాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలు దాదాపు పూర్తయ్యాయి.

తెలంగాణ

తెలంగాణ

మానవ వనరుల పంపకాలూ దాదాపు చివరి దశకు చేరాయి. విడిపోతున్న రాష్ట్రాల్లో ఎవరికివారు కొత్త జీవితం ఆరంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కావడానికి కొద్ది గంటలే మిగిలి ఉంది.

తెలంగాణ

తెలంగాణ

అప్పాయింట్ డే అయిన జూన్ 2 ముహూర్తానికి కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో విభజన ప్రక్రియను అటు కేంద్రం, ఇటు రాష్ట్ర అధికారులు మరింత వేగవంతం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+