కళామందిర్‌లో తారల సందడి: ఆడిపాడారు(ఫోటోలు)
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలోని భాగ్యనగర్ కాలనీలో కళామందిర్ ఫౌండేషన్ ఐదో వార్షికోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. సినీ నటులు నిఖితానారాయణ్, ప్రియ, శ్వేత, రాహుల్ రవీంద్రన్ పాల్గొని సందడి చేశారు. కళామందిర్ నిర్వహకులు సామాజిక స్పృహతో అనాథ, అంధ విద్యార్ధులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనాథ విద్యార్ధుల నృత్యాలు, ఆటపాటలు అందరినీ అలరించాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సినీ నటులు రాహుల్ రవీంద్రన్, నిఖిత నారాయణ్‌లు చిన్నారులతో ఆడిపాడారు. వివిధ కారణాలతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన బాలలను ఆదుకోవడానికి కళామందిర్ నిర్వహకులు చేస్తున్న కృషి అభినందనీయమని వారు పేర్కొన్నారు.
కళామందిర్ ఫౌండేషన్ సీఈఓ ప్రసాద్ చలవాది మాట్లాడుతూ తమ సంస్ధ ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అనాథ, అంధ విద్యార్ధుల సంస్ధకు ఆర్ధిక సాయం అందజేశారు. సంస్ధ ఉద్యోగుల పిల్లలకు ఉపకార వేతనాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన చెర్రీస్ ఫౌండేషన్, కస్తూరిబా గాంధీ నేషనల్ మోమోరీయిల్ ట్రస్ట్ వారికి రూ. 25 వేల చెక్కును విరాళంగా అందజేశారు. సంస్ధ వార్షికోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని అన్ని షోరూంలలో రక్తదాన శిబిరాలను నిర్వహించామని ప్రసాద్ తెలిపారు.

కళామందిర్ వార్షికోత్సవంలో సినీ నటుల సందడి
నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలోని భాగ్యనగర్ కాలనీలో కళామందిర్ ఫౌండేషన్ ఐదో వార్షికోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. సినీ నటులు నిఖితానారాయణ్, ప్రియ, శ్వేత, రాహుల్ రవీంద్రన్ పాల్గొని సందడి చేశారు.

కళామందిర్ వార్షికోత్సవంలో సినీ నటుల సందడి
కళామందిర్ నిర్వహకులు సామాజిక స్పృహతో అనాథ, అంధ విద్యార్ధులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనాథ విద్యార్ధుల నృత్యాలు, ఆటపాటలు అందరినీ అలరించాయి.

కళామందిర్ వార్షికోత్సవంలో సినీ నటుల సందడి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సినీ నటులు రాహుల్ రవీంద్రన్, నిఖిత నారాయణ్‌లు చిన్నారులతో ఆడిపాడారు.

కళామందిర్ వార్షికోత్సవంలో సినీ నటుల సందడి
వివిధ కారణాలతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన బాలలను ఆదుకోవడానికి కళామందిర్ నిర్వహకులు చేస్తున్న కృషి అభినందనీయమని వారు పేర్కొన్నారు.

కళామందిర్ వార్షికోత్సవంలో సినీ నటుల సందడి
కళామందిర్ ఫౌండేషన్ సీఈఓ ప్రసాద్ చలవాది మాట్లాడుతూ తమ సంస్ధ ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అనాథ, అంధ విద్యార్ధుల సంస్ధకు ఆర్ధిక సాయం అందజేశారు. సంస్ధ ఉద్యోగుల పిల్లలకు ఉపకార వేతనాలు అందజేశారు.

కళామందిర్ వార్షికోత్సవంలో సినీ నటుల సందడి
ఈ సందర్భంగా ఆయన చెర్రీస్ ఫౌండేషన్, కస్తూరిబా గాంధీ నేషనల్ మోమోరీయిల్ ట్రస్ట్ వారికి రూ. 25 వేల చెక్కును విరాళంగా అందజేశారు.

కళామందిర్ వార్షికోత్సవంలో సినీ నటుల సందడి
సంస్ధ వార్షికోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని అన్ని షోరూంలలో రక్తదాన శిబిరాలను నిర్వహించామని ప్రసాద్ తెలిపారు.

Click it and Unblock the Notifications