మేథ్స్‌లో భళా: మళ్లీ గిన్నిస్‌కెక్కిన కరీంనగర్ బాలిక

శుక్రవారం నాడు పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మూడో తరగతి చదువుతున్న ఈ ఏడేళ్ల చిన్నారి తన మేథస్సును ప్రదర్శించారు. గణితవేత్తలు తదితరులు ఈ కార్యక్రమం వీక్షించి ఆమెకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో గిన్నిస్ రికార్డ్ ప్రతినిధి వేణు ఆమెకు జ్ఞాపికను అందించారు.
శివ యజ్ఞిక 222 'పై' విలువను మొదటి ప్రయత్నంలో 40.48 సెకండ్లలో, రెండో ప్రయత్నంలో 38.25 సెకంట్లలో, మూడో ప్రయత్నంలో 36.36 సెకండ్లలో ఎలాంటి తప్పులు లేకుండా దశాంశ విలువలను చెప్పింది. గతంలో ఈ రికార్డ్ 142 యొక్క 'పై' విలువ పైన ఉంది.
శివ యజ్ఞిక ఆరేళ్ల ఎనిమిది నెలల వయస్సులో ఉన్నప్పుడు 15 దేశాల జాతీయ గీతాలను ఆలపించింది. ఇప్పుడు ఆమె వయస్సు ఏడు సంవత్సరాల ఏడు నెలలు.












Click it and Unblock the Notifications