ధూల్‌పేట్‌లో కేసీఆర్, మోడీ గాలిపటాలు (ఫోటోలు)
హైదరాబాద్: సంక్రాంతి వచ్చిందంటే చాలు పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ మురిసిపోతారు. గాలిపటాల తయారీదారులు కూడా వివిధ రకాలైన గాలిపటాలు తయారు చేసి అమ్ముతుంటారు. నగరంలోని ధూల్‌పేట్‌లో సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్రమోడీ బొమ్మలతో తయారు చేసిన గాలిపటాలను అమ్మకానికి పెట్టారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
పిల్లలు వీటిని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా మకర సంక్రాంతి నాడు పిల్లలు పోటీలుపడి గాలిదేవుడి సహనాన్ని పరీక్షించి గాలిపటాలను ఎగురవేస్తుంటారు. మన దేశంలో
ఈ గాలిపటాలకు అత్యంత ప్రాదాన్యతనిస్తూ ఒక మ్యూజియం ను కూడా ఏర్పాటు చేశారు.
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో గాలిపటం మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది జనవరిలో గుజరాత్‌లోని అహ్మాదాబాద్‌లో 20వ ఇంటర్నే షనల్ కైట్ ఫెస్టివల్ ఎంతో అట్టహాసంగా జరిగింది.
ఈ ఫెస్టివల్‌లో మనదేశంతో పాటు 34 దేశాలకు చెందిన వారు పాల్గొని ఆకర్షణీయంగా తయారైన వెరైటీ గాలిపటాలను ఎగురవేశారు. బ్రిటన్, జర్మనీ, లిథివేనియా, సింగపూర్, మలేషియా తదితర దేశాలకు చెందిన వారు పాల్గొని ఈ పండు గకు ప్రత్యేక శోభను తీసుకువచ్చారు. ఇక ఈ అంతర్జాతీయ గాలిపటాల పండుగను అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ప్రారంభించారు.

ధూల్‌పేట్‌లో కేసీఆర్, మోడీ గాలిపటాలు
నగరంలోని ధూల్‌పేట్‌లో కేసీఆర్ గాలిపటం. సంక్రాంతి వచ్చిందంటే చాలు పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ మురిసిపోతారు.

ధూల్‌పేట్‌లో కేసీఆర్, మోడీ గాలిపటాలు
నగరంలోని ధూల్‌పేట్‌లో కేసీఆర్ గాలిపటాన్ని చూపుతున్న మహిళ. గాలిపటాల తయారీదారులు కూడా వివిధ రకాలైన గాలిపటాలు తయారు చేసి అమ్ముతుంటారు.

ధూల్‌పేట్‌లో కేసీఆర్, మోడీ గాలిపటాలు
నగరంలోని ధూల్‌పేట్‌లో కేసీఆర్ గాలిపటం. సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని తయారీదారులు వివిధ రకాల గాలిపటాలను తయారు చేసారు.

ధూల్‌పేట్‌లో కేసీఆర్, మోడీ గాలిపటాలు
నగరంలోని ధూల్‌పేట్‌లో కేసీఆర్ గాలిపటం. సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని తయారీదారులు వివిధ రకాల గాలిపటాలను తయారు చేసారు.

ధూల్‌పేట్‌లో కేసీఆర్, మోడీ గాలిపటాలు
నగరంలోని ధూల్‌పేట్‌లో జాతీయ జెండాతో రూపొందించిన గాలిపటం. సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని తయారీదారులు వివిధ రకాల గాలిపటాలను తయారు చేసారు.

ధూల్‌పేట్‌లో కేసీఆర్, మోడీ గాలిపటాలు
నగరంలోని ధూల్‌పేట్‌లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో రూపొందించిన గాలిపటం. సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని తయారీదారులు వివిధ రకాల గాలిపటాలను తయారు చేసారు.












Click it and Unblock the Notifications