మధ్యాహ్నం 3:30 గంటలకే కొత్త ఏడాది జరుపుకొనే తొలి దేశం ఇదే: ఏ దేశంలో ఎప్పుడు?

Happy New Year 2025: ఇంకొన్ని గంటల్లో ఈ ప్రపంచం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. ఎన్నో కొత్త ఆశలతో 2025 రాబోతోంది. కొత్త ఏడాదిని స్వాగతం పలకడానికి భారత్ సహా అన్ని దేశాలు సంసిద్ధం అయ్యాయి. ఒక్కో దేశం ఒక్కో విధంగా కొత్త ఏడాదిలో ఎంట్రీ ఇవ్వబోతోంది.

పసిఫిక్ మహా సముద్ర ప్రాంత దేశాలు అన్నింటి కంటే ముందుగా కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకొంటాయి. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో- ఆ భానుడి లేలేత కిరణాలు తొలిసారిగా ఆ దేశాల మీదే ప్రసరిస్తుండటమే దీనికి కారణం. తొలి పొద్దు పొడిచేది పసిఫిక్ మహా సముద్ర తీర ప్రాంత దేశాల్లోనే. ఆ తరువాతే ప్రపంచం నిద్ర లేస్తుంటుంది.

Kiribati is the 1st country to welcome New Year 2025

పసిఫిక్ మహా సముద్రంలోని చిన్న ద్వీప దేశం.. కిరిబాతి. ఇక్కడి జనాభా 1.34 లక్షలు. ఓ అసెంబ్లీ నియోజకవర్గం కంటే తక్కువ జనాభా ఉండే దేశం ఇది. కొత్త సంవత్సరం మొట్టమొదటిసారిగా అడుగుపెట్టేది ఈ దేశంలోనే. కిరిబాతిలో అర్ధరాత్రి 12 గంటలైతే.. భారత్‌లో మధ్యాహ్నం 3:30 అవుతుంది. కిరిబాతి, టోంగా దీవుల్లోనూ ఒకేసారి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటారు.

కొత్త సంవత్సరాన్ని తొలిసారిగా జరుపుకొనే పెద్ద దేశాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. కొత్త సంవత్సరం చివరిసారిగా పలకరించే హౌలాండ్ అండ్ బేకర్ ఐలండ్స్. భూగోళం అంచుల్లో ఉండే ద్వీప దేశాలివీ. దీని తరువాత మళ్లీ టోంగా, సమోవా, కిరిబాతిల్లో సూర్యోదయమౌతుంది.

నిజానికి ఈ రెండూ టోంగా, సమోవాలకు సమీపంలోనే ఉంటాయి. విభజన రేఖ, భౌగోళిక స్థితిగతులు..సూర్యోదయాస్తమానాలను ప్రాతిపదికగా తీసుకుంటే భూగోళానికి ఒకింత అంచున ఉన్నట్టుగా నిర్దారించారు. ఉత్తర అమెరికా ఖండం పరిధిలో ఉంటాయివి.

ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం.. మధ్యాహ్నం 3:30 గంటలకు కిరిబాతి, టోంగా, న్యూజిలాండ్ కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకొంటాయి. ఆస్ట్రేలియా 6:30 గంటలకు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతుంది. జపాన్, దక్షిణకొరియా, ఉత్తరకొరియా రాత్రి 8:30కు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి.

రాత్రి 9:30 గంటలకు చైనా, ఫిలిప్పీన్స్, సింగపూర్‌లల్లో న్యూ ఇయర్ ఎంట్రీ అవుతుంది. బంగ్లాదేశ్-11:30 నిమిషాలు, నేపాల్-11:45 నిమిషాలు, భారత్, శ్రీలంక-12 గంటలు, పాకిస్తాన్-12:30లకు కొత్త సంవత్సరంలో అడుగు పెడతాయి.

జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, స్పెయిన్‌లల్లో తెల్లవారు జామున 4:30, బ్రిటన్, ఐర్లాండ్, ఐస్‌లాండ్, పోర్చుగల్‌లల్లో 5:30 గంటలకు కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఇదే ఐఎస్టీ ప్రకారం.. జనవరి 1వ తేదీన ఉదయం 7:30 గంటలకు బ్రెజిల్‌లోని కొన్ని రీజియన్లలో అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది.

అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, పరాగ్వేల్లో 8:30 గంటలకు కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకొంటారు. న్యూయార్క్, వాషింగ్టన్, డెట్రాయిట్-10:30, చికాగో-11:30, కొలరాడో, అరిజోనా-12:30, నెవాడా-1:30, అలస్కా-2:30, హవాయ్-3:30లల్లో కొత్త సంవత్సరం ఎంట్రీ ఇస్తుంది. అమెరికన్ సమోవా-సాయంత్రం 4:30, హౌలాండ్ అండ్ బేకర్స్ ఐలండ్స్‌లల్లో 5:30 గంటలకు కొత్త ఏడాది ప్రవేశిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+