కత్తులతో మసాజ్: చైనాలో ఫుల్ క్రేజ్.. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా!

ఒళ్లు నొప్పులతో బాధపడే ఎంతోమంది చైనీయులు ఈ మసాజ్ ద్వారా ఉపశమనం పొందినట్లు చెబుతున్నారు. ఇటీవల ఈ పార్లర్ ను సంప్రదించిన పెంగ్ అనే మహిళ..

బీజింగ్: మసాజ్ అనగానే.. ఒంటినిండా ఆయిల్ లేదా లోషన్స్ లాంటివి పూసి.. మర్దన చేయడం గుర్తొస్తుంది. కానీ చైనీస్ లోని ఓ మసాజ్ సెంటర్ ఇందుకు పూర్తిగా బిన్నం. ఇక్కడ మసాజ్ చేతులతో చేయరు.. కత్తుల్ని కస్టమర్స్ బాడీపై లయబద్దంగా కదిలిస్తారు. కూరగాయలు తరిగే కత్తుల్ని ఇలా మసాజ్ కు ఉపయోగించడం మనకు కొత్తగా అనిపించవచ్చేమో గానీ.. చైనాలో మాత్రం ఇదో పురాతన సాంప్రదాయ ప్రక్రియ.

2,500ఏళ్ల క్రితం నుంచి చైనాలో ఈ మసాజ్ ప్రక్రియ కొనసాగుతోంది. కత్తులతో మసాజ్ చేయించుకోవడానికి వెళ్లేవారు.. తొలుత కాస్త కంగారుపడ్డా.. ఆ తర్వాత కొత్త రకం అనుభూతిని చవిచూశామంటూ చెబుతుంటారు. తైవాన్ లోని తైపీ ప్రాంతంలో హియో మీ ఫాంగ్ అనే మహిళ ప్రస్తుతం ఈ మసాజ్ సెంటర్ నిర్వహిస్తోంది. ఇక్కడికి వచ్చే చాలామంది కస్టమర్స్.. తప్పకుండా ఇలాంటి మసాజ్ చేయించుకోవాల్సిందేనని తోటివారికి కూడా సూచిస్తున్నారు.

Knife Massage: Try the Traditional Chinese Treatment

దీంతో ఈ మసాజ్ పార్లర్ కు రోజురోజుకు కస్టమర్ల తాకిడి పెరుగుతూనే ఉంది. కత్తులతో మసాజ్ చేయించుకోవడం వల్ల శరీరంలో ఒక రకమైన కరెంటు ప్రవహిస్తుందని కొంతమంది కస్టమర్లు చెబుతుండగా.. ఇదో పునురుజ్జీవం లాగా అనిపిస్తుందని మరికొంతమంది చెబుతుండటం విశేషం.

ఒళ్లు నొప్పులతో బాధపడే ఎంతోమంది చైనీయులు ఈ మసాజ్ ద్వారా ఉపశమనం పొందినట్లు చెబుతున్నారు. ఇటీవల ఈ పార్లర్ ను సంప్రదించిన పెంగ్ అనే మహిళ.. కత్తులతో మసాజ్ తర్వాత తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు వివరించారు. అంతకుముందు రెగ్యులర్ గా ఆసుపత్రుల చుట్టూ తిరిగే తాను.. ఇక్కడికి వచ్చాక చాలావరకు ఉపశమనం పొందానని చెప్పారు. ఆ నోటా.. ఈ నోటా.. ఈ కత్తుల మసాజ్ గురించి జోరుగా ప్రచారం సాగుతుండటంతో చైనాలో ఇప్పుడు దీనికి భలే గిరాకీ ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+