యూత్ స్పెషల్ :ప్రేమలేఖ
ప్రియా!
"ఏల సలిలమ్ము పారు
గాడ్పేల విసురు
ఏల ప్రేమింతు నిన్ను" అని అ భావ కవి అన్నాడు. నీ మీద నాకు ప్రేమ ఎందుకు జనించిందో తెలియదు. నీవంటే వల్లమాలిన అనురాగం. నిను చూడాలని, నీతో మాట్లాడాలని నిరంతరం నా హృదయం ఆరాపపడుతోంది. నీవు లేకుంటే జీవితంలో ఏదో లోటు కనిపిస్తుంది.
నిను విడిచి నేను ఉండలేనేమో అని కూడా అనిపిస్తుంది. కానీ, నువ్వూ నేను వ్యక్తులుగా వేర్వేరు. మన శరీరాలు వేరు గానీ ఆత్మ ఒక్కటే అనిపిస్తుంది. నువ్వు ఏ క్షణాన నను కలిశావో గానీ నా హృదయంలో ప్రేమ బీజాలను నాటి వెళ్లావు.

జీవితమంటే ఒక్క ప్రేమ మాత్రమేనా అని అడిగితే, కాదని చెప్పగలను. కానీ నువ్వు నా జీవితంలో భాగం కావాలనే కోరిక మాత్రం నాలో నాటుకుపోయింది. నీ చెంత ఉన్నంత సేపు ఈ లోకాన్ని మరిచిపోతాను. అంతే కాదు, నన్ను నేను మరిచిపోతాను.
నువ్వూ నేనూ ఒక్కటేనని కూడా అనిపిస్తుంది. నీలో ఉందేదో నాలోనూ అదే ఉందనిపిస్తుంది. ప్రియా... ఓసారి వచ్చి తనివి తీరా నిను చూసుకుని, నీతో మాట్లాడే అవకాశం కల్పించవా....
నీ కోసం ఎదురు చూస్తూ.....












Click it and Unblock the Notifications