తీసెయ్: రాహుల్ 'గాంధీ'పై ముని మనవడి ప్రశ్న
బెంగళూరు: జాతిపిత మహాత్మా గాంధీతో నీకేం సంబంధమని, మీరేలా గాంధీ అవుతారని.. మహాత్మా గాంధీ మునిమనవడు శ్రీకృష్ణ కులకర్ణి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు. నెహ్రూ కుటుంబానికి, గాంధీ కుటుంబానికి సంబంధం ఏమిటన్నారు. ఇప్పటికైనా పేరులో గాంధీ అనే పదం వాడటం మానుకోవాలని సూచించారు.
కపటత్వంతోనే గాంధీ పేరు వాడుతున్నారని, స్వార్థ ప్రయోజనాల కోసమే ఎన్నికల్లో ఉపయోగం కోసమని దుయ్యబట్టారు. మహాత్మా గాంధీ హత్య విషయంలో విచారణ కమిటీలు ఆర్ఎస్ఎస్‌ను తప్పుబట్టలేదన్నారు. ఇటువంటి వాళ్లు నేతలైతే శాపగ్రస్తులమే అన్నారు. రాజీవ్ గాంధీని కొంతమంది తమిళులు చంపారని, అలాంటప్పుడు తమిళులు అందరు దుర్మార్గులా అని ప్రశ్నించారు.

ఆర్ఎస్ఎస్, తమిళులు, సిక్కులందరినీ భారత్ నుంచి పంపేస్తామా అని ప్రశ్నించారు. కాంగ్రెసు పోస్టర్లలో ఇందిర, సోనియా, రాజీవ్, రాహుల్‌లేనని, వారి పేరు పక్కన గాంధీని ఎందుకు తగిలించుకుంటారని ఘాటుగా ప్రశ్నించారు. మరి వాటిలో నెహ్రూ ఫోటోను ఎందుకు పెట్టరో చెప్పాలన్నారు.
తాను ప్రముఖుడిని కాదని కానీ, చాలామందికి నేను బాపు ముని మనుమడిని అని తెలుసునని, తమ గాంధీజీకి రాహుల్‌కు ఎటువంటి సంబంధమూ లేదన్నారు. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ తాను రాహుల్‌కు లేఖ కూడా రాశానన్నారు. జాతీయ స్థాయిలో గాంధీ అంటే మహాత్మా గాంధీయేనని, అందుకే తెలివిగా ఆ పేరును ఉపయోగించుకుని మహాత్ముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని దనుమాడారు.












Click it and Unblock the Notifications