మన్మథ నామ సంవత్సరం: గ్రహస్థితులు ఎలా?
హంస వర్యాధిరకూఢం తం వీనామండిత హస్తకమ్
హిరణ్య గర్భం వన్దేహః మన్మథాఖ్య మనిష్టహమ్
సర్వజనులకు సంతోషాన్ని, అనందాన్ని పెంపొందించేది మన్మథ నామ సంవత్సరం.
మన్మథాబ్దే తథా లోకా స్సత్కేళీ శీల లోలుపాః
శాలీక్షు యవ గోధూమై ర్నయనాభినవాధరా
మధ్యమం ఫలితం ధాన్యం కమమోహమయం జగత్
జన ప్రీతికరో లోకే మన్మథే స్యాచ్య మధ్యమః
మన్మథ నామ సంవత్సరంలో ప్రజలంతా కామకేళీ విలాసాలపై ఆసక్తి ఎక్కువగను,న మంచి స్వభావాన్ని మంచి మాటను కలిగి ఉంటారు. వరి, చెఱకు, యవలు, గోధుమలు విరివిగా పండుతాయి. మొత్తంమీద మధ్య ఫలితాలనిస్తుంది.
బార్హస్పత్యమానం చేత ఈ సంవత్సరాన్ని ‘కీలక' నామ సంవత్సరం అంటారు. ఈ సంవత్సరంలో అందరికి పైత్యరోగాలు, భయాందోళనలు, పరస్పర సంఘర్షణలు అధికమౌతాయి. వర్షాలు తక్కువగా కురుస్తాయి.
గురూదయ వశంతో మాఘాబ్దములో ` సస్యవృద్ధి, ధరలు, అనారోగ్య భయాలు, వర్షాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజలందరికీ ధర్మముపైన, పితృదేవతాత్మకమైన పూటలపైన ఆసక్తి పెరుగుతుంది.

సంవత్సరానికి 9 మంది ప్రధాన నాయకులుంటారు. వారిలో 6 గురు శుభులు. మొత్తం ఉపనాయకులతో 30 మందిలో 18 మంది శుభులు (20/30 శుభులుÑ 6/9 శుభులు)
రాజు ` శని : సస్యాలు మధ్యమంగా ఫలిస్తాయి. వర్షాలు చిత్రంగా వర్షిస్తాయి. దొంగలబాధ, రోగభయం, రాజకోపము అధికం. చిరుధాన్యయు, తక్కువకాలంలో పండే ధాన్యం పుష్కలంగా ఫలిస్తుంది.
మంత్రి ` కుజ: కలహం, యుద్ధం, చోర, రోగ, అగ్ని భయాలు ఎక్కువ. వర్షాలు సామాన్యం. సస్యాలు తెగుళ్ళ వల్ల తొలిపంటలకు ఇబ్బంది. ధాన్యాదులకు ధరలు పెరుగుతాయి.
సేనాధిపతి ` చంద్ర: వర్షాలు బాగా కరుస్తాయి. ధరలు బాగా పెరుగుతాయి. ప్రజలు ఆరోగ్యంతో సుఖంగా ఉంటారు. ఆవులు సమృద్ధిగా పాలను ఇస్తాయి.
సస్యాధిపతి ` శుక్ర: మాగాణి పంటలు, మెట్టపంటలు సమృద్ధిగా ఫలిస్తాయి. తెలుపు వర్ణపు భూములు బాగా ఫలవంతమౌతాయి. అంతటా సువృష్టి కురుస్తుంది.
ధాన్యాధిపతి ` బుధ: మధ్యమ వృష్టి, తక్కువ పంట, వాయుపీడిత మేఘాలు. ప్రజలంతా భయకంపితులౌతారు
అర్ఘాధిపతి ` చంద్ర: అన్ని పంటలు వృద్ధి చెందుతాయి. వస్తువులకు ధరలు అధికమౌతాయి.
మేఘాధిపతి ` చంద్ర: దేశమంతా అన్నిరకాల ధన్యాలు బాగా పండుతాయి. గోవులు సమృద్ధిగా
పాలనిస్తాయి.
రసాధిపతి ` రవి: నెయ్యి, నూనెలు, బెల్లం, తేనె మొదలైన రస జాతులకు ధరలు తగ్గుతాయి.
నీరసాధిపతి ` గురు: వక్కలు, మణులు, రత్నం, బంగారం, వెండి, ధాన్యం, పత్తి, చర్మాలు, సుగంధ, ద్రవ్యాలు, చందనం, పూలు మొదలైనవాని ఉత్పత్తి అధికమౌతుంది.
సర్వ సస్య సముదాయమైన 16 వీసాలలో 8 వీసాల పంట ఫలిస్తుంది. రెండవ పంట బాగా పండుతుంది.
పశుపాలకుడు ` బలరాముడు, పశువుల దొడ్డి పెట్టువాడు ` శ్రీకృష్ణుడు, దొడ్డి నుండి విడిపించువాడు కృష్ణుడు. ఈ మూడిరటి ఆధిపత్యాలు శ్రీకృష్ణ, బలరాములకు రావడం వల్ల పశువులకు అభివృద్ధి, బహు సస్య సంపద, తృణ సమృద్ధి, క్షీర సమృద్ధి.
వర్షం 1 కుంచము. సుభిక్షము. అందులో 9 భాగాలు సముద్రంలో, 5 భాగాలు పర్వతాల మీద 7 భాగాలు భూమిమీద వర్షిస్తాయి. తెల్లని పంటలు, తెల్లభూములు విస్తారంగా ఫలిస్తాయి. సస్యానుకూల వర్షాలుంటాయి.
గ్రహణాలు: ఈ సంవత్సరం చైతత్ర పూర్ణిమ శనివారం 4.4.2015 రోజున హస్త నక్షత్రంలో కన్యారాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుంది. అదేవిధంగా మాఘ కృష్ణ అమావాస్య బుధవారం 9.3.2016 నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో కేతుగ్రస్త సూర్యగ్రహణం సంభవిస్తుంది.
మౌఢ్య: నిజాషాడ కృష్ణ ఏకాదశి సోమవారం 10.8. 2015 నుండి శ్రావణ కృష్ణ ద్వాదశి బుధవారం 9.9.2015 వరకు గురుమౌఢం. నిజాషాడ కృష్ణ దశమి ఆదివారం 9.8.2015 నుండి శ్రావణ శుక్ల పంచమి గురువారం 20.8.2015 వరకు శుక్రమౌఢ్యం.
అధికమాసం: ఈ సంవత్సరం ఆషాఢ మాసం అధికమాసం.
యమునా నదీ పుష్కరాలు: 14.7.2015 మంగళవారం నుండి సార్థ త్రికోటి తీర్థ సహిత గోదావరీ నదీ పుష్కరాలు ప్రారంభమై 25. 7. 2015 శనివారం వరకు పూర్తి అవుతాయి.
ఈ సంవత్సరం సర్వాదాయం 53, సర్వ వ్యయం 56 ఉండడం వల్ల దానాదులు అదికంగా చేయడం వల్లనే అంతటా సంతోషం, సమృద్ధి నిండగలవు. అభివృద్ధి చేకూరగలదు.
ప్రపంచంలోని తెలుగువారందరికీ ఈ మన్మథ నామ సంవత్సరం ఆనందాన్ని, అభివృద్ధి కలిగించాలని ఆ పరమేశ్వరిని, శ్రీమాతను ప్రార్థిస్తూ...
సర్వేభవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్
సర్వే జనాః సుఖినో భవస్తు... సమస్త సన్మంగళాని భవంతు.
- మారుతి శర్మ












Click it and Unblock the Notifications