బతుకమ్మలను మోసిన జ్వాలా, కవిత, పద్మా (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయానికి అద్దం పట్టే బతుకమ్మ పండుగ హైదరాబాదులో గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాదులోని ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ సోయగాలు విప్పారాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దంపతులు, గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం నుంచి బతుకమ్మల ఊరేగింపు ట్యాంక్‌బండ్ వరకు సాగింది. వేలాది మంది మహిళలు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పండుగగా నిర్వహించింది.
బతుకమ్మలను గురువారం రాత్రి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. ఆ తర్వాత హుస్సేన్ సాగర్‌లోని వృధాను హైదరాబాద్ నగరపాలక సంస్థ కార్మికులు తోడేయడం ప్రారంభించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం తర్వాత కూడా ఇలాగే తోడేశారు.

బతుకమ్మ వేడుకల్లో..
ట్యాంక్‌బండ్‌పై జరిగన వేడుకల్లో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, ముఖ్యమంత్రి సతీమణి శోభ కూడా బతుకమ్మ ఆడారు.

అంగరంగ వైభవంగా..
గురువారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఊరేగింపు చేరుకుంది. వేలాది మంది మహిళలు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు.

నిమజ్జనం కోసం..
బతుకమ్మ ఆడిన తర్వాత చెరువులో వాటిని నిమజ్జనం చేయడం సంప్రదాయం. మహిళలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయడానికి తీసుకుని వెళ్తూ..

కవిత, పద్మా దేవేందర్ రెడ్డి..
బతుకమ్మ ఊరేగింపులో పాల్గొన్న ఎంపి కల్వకుంట్ల కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తమ బతుకమ్మలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు.

ఇలా తోడేస్తూ...
బతుకమ్మలను నిమజ్జనం చేయడంతో హుస్సేన్ సాగర్‌లో పేరుకుపోయిన వృధాను తొలగిస్తున్న ఎంసిహెచ్ కార్మికులు

పూలను తోడేసి..
బతుకమ్మల నిమజ్జనంతో హుస్సేన్ సాగర్‌లో నిండిపోయిన రంగు రంగుల పూవులను ఎంసిహెచ్ కార్మికులు తోడేశారు.

జ్వాలా గుత్తా...
బతుకమ్మను ఎత్తుకున్న ప్రముఖ క్రీడాకారిణి జ్వాలా గుత్తా తన బతుకమ్మను ఇలా నిమజ్జనం చేయడానికి తీసుకుని వెళ్తూ..
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications