‘మిసెస్ ఇండియా న్యూ ఇంగ్లాండ్’గా హైదరాబాదీ
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన సౌమ్య ధర్మతేజ ఇంగ్లాండ్‌లో స్థిరపడ్డారు. ఆమె అక్కడ జరిగిన పోటీల్లో 'మిసెస్ ఇండియా న్యూ ఇంగ్లాండ్ 2016' కిరీటం కైవసం చేసుకున్నారు. తనకు ఈ కిరీటం దక్కడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

మిసెస్ ఇండియా న్యూ ఇంగ్లాండ్
మలక్‌పేటకు చెందిన సౌమ్య పదేళ్ల క్రితం ఇంగ్లాండ్‌కు వెళ్లారు. అక్కడ ఐటీ రంగంలో పనిచేస్తున్నారు.

చిన్నతనం నుంచే..
చిన్నతనం నుంచి నృత్యం అంటే ఆసక్తి కనబరిచే సౌమ్య ధర్మతేజ.. తొలిసారి అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. మిసెస్ ఇండియా న్యూ ఇంగ్లాండ్ 2016 కిరీటం దక్కడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

ముగ్గురు విజేతలు
2016 మిస్ ఇండియా న్యూ ఇంగ్లాండ్ పీజెంట్ ఫాతిమా అర్మాఘన్, మిస్ ఇండియా టీన్ న్యూ ఇంగ్లాండ్ సానియా పాలియా, మిసెస్ ఇండియా ఆఫ్ న్యూ ఇంగ్లాండ్ సౌమ్య ధర్మతేజ వేదికపై చేతులు ఊపుతూ ఇలా.

మిస్ ఇండియా
మిస్ ఇండియా న్యూ ఇంగ్లాండ్ 2016 విజేత ఫాతిమా అర్మఘన్, రన్నరప్ అమర్ ధలీవాల్, మిస్ ఇండియా యూఎస్ఏ స్టేట్ డైరెక్టర్, మిస్ ఇండియా న్యూ ఇంగ్లాండ్ డైరెక్టర్ రుచికా అరోరా.












Click it and Unblock the Notifications