కళా వారసత్వం: ‘కాళోజీ కళాక్షేత్రం’(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత చరిత్రను సంపన్నం చేసిన కాకతీయుల కళావారసత్వాన్ని నిలబెట్టే రీతిలో వరంగల్‌లో ప్రజాకవి, తెలంగాణ స్వాప్నికుడు కాళోజీ నారాయణరావు పేరిట కళా క్షేత్రాన్ని నిర్మించనున్నట్లు గిరిజన అభివృద్ధి, టూరిజం సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆడిటోరియం డిజైన్‌ను విడుదల చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకతీయుల కళాఖండాలు ఎంతో దివ్యమైనవని, చరిత్రాత్మకమైనవని అన్నారు. ఆ స్థాయిలో కొనసాగింపుగా కళాభవనం ఉండాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రాంత ప్రజల ఔన్నత్యానికి తగ్గట్టుగా భవనం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
హన్మకొండలోని బాల సముద్రంలో 3 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంత సంస్కృతి ప్రతిబింబిచేలా కవులు, కళాకారులు, వృత్తిదారులకు ఈ కళాభవనం వేదిక కానుందని పేర్కొన్నారు. కళాకారుల అవసరాలకు తగ్గట్టుగా దాదాపు వెయ్యిమంది కూర్చునేలా అతిపెద్ద ఆడిటోరియం నిర్మించనున్నట్లు తెలిపారు.
వృత్తిదారుల విలువను పెంచేలా ఆర్ట్‌గ్యాలరీ నిర్మాణం చేస్తామన్నారు. గ్రంథాలయం, సమావేశ మందిరం, వర్క్‌షాప్ హాల్స్, వాహనాల కోసం పార్కింగ్ మెరుగైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ భవన నిర్మాణానికి రూ.30 కోట్ల రూపాయలు అవసరం కాగా, రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్లు కేటాయించిందని, మిగితా మొత్తాన్ని సహాయంగా అందించాలని కేంద్రాన్ని అడుగుతున్నామన్నారు.
సెప్టెంబర్ 8వ తేదీ కాళోజీ జయంతి నాటికి పాక్షికంగానైనా ఈ నిర్మాణాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ప్రజలు ఈ భవనాన్ని తమ కళావారసత్వంగా స్వీకరిస్తారని, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి అక్షర దీపమై వెలిగిన మహాకవి కాళోజీ స్ఫూర్తి, కాకతీయుల కళావారసత్వం ఈ భవన నిర్మాణానికి ప్రేరణ అని మంత్రి చందూలాల్ పేర్కొన్నారు.

‘కాళోజీ కళాక్షేత్రం'
తెలంగాణ ప్రాంత చరిత్రను సంపన్నం చేసిన కాకతీయుల కళావారసత్వాన్ని నిలబెట్టే రీతిలో వరంగల్‌లో ప్రజాకవి, తెలంగాణ స్వాప్నికుడు కాళోజీ నారాయణరావు పేరిట కళా క్షేత్రాన్ని నిర్మించనున్నట్లు గిరిజన అభివృద్ధి, టూరిజం సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు.

‘కాళోజీ కళాక్షేత్రం'
సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆడిటోరియం డిజైన్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకతీయుల కళాఖండాలు ఎంతో దివ్యమైనవని, చరిత్రాత్మకమైనవని అన్నారు.

‘కాళోజీ కళాక్షేత్రం'
ఆ స్థాయిలో కొనసాగింపుగా కళాభవనం ఉండాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. తెలంగాణ ప్రాంత ప్రజల ఔన్నత్యానికి తగ్గట్టుగా భవనం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

‘కాళోజీ కళాక్షేత్రం'
హన్మకొండలోని బాల సముద్రంలో 3 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంత సంస్కృతి ప్రతిబింబిచేలా కవులు, కళాకారులు, వృత్తిదారులకు ఈ కళాభవనం వేదిక కానుందని పేర్కొన్నారు.
-
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం












Click it and Unblock the Notifications