మిస్డ్‌కాల్ ప్రేమ: ఒక్కటైన టీ అబ్బాయి-ఏపీ అమ్మాయి
నిజామాబాద్: అనుకోని సంఘటనలు కొందరి కలుపుతాయి.. కొందరిని విడదీస్తాయి. ఇక్కడ మాత్రం మొదటిదే జరిగింది. పొరపాటున సెల్‌ఫోన్‌కు వచ్చిన ఒక్క మిస్డ్‌కాల్ ఓ జంటను ఒక్కటి చేసింది.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్(ఎం) గ్రామానికి చెం దిన కుర్ధుల శ్రీనివాస్‌కు గత డిసెంబర్ 13న పొరపాటున ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన సంధ్య ఫోన్ నుంచి మిస్డ్‌కాల్ వచ్చింది.

అదే నంబర్ నుంచి మరునాడు ఓ ఎస్‌ఎమ్మెస్ వచ్చింది. శ్రీనివాస్ తిరిగి ఫోన్‌చేయగా ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమకు దారితీసింది. ఒకరిపై ఒకరికి ఇష్టం కలగడంతో వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే, ఇంట్లో ఒప్పుకునే అవకాశం లేకపోవడంతో సంధ్య నేరుగా శ్రీనివాస్ దగ్గరికి వచ్చేసింది. ఇద్దరూ మేజర్లు కావడంతో శనివారం చుక్కాపూర్ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.












Click it and Unblock the Notifications