ఆదర్శ గ్రామంగా పేరుపాలెం సౌత్: చిరంజీవి(పిక్చర్స్)
హైదరాబాద్/పశ్చిమగోదావరి: రాజకీయాలకు అతీతంగా పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకారం అందించాలని కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె చిరంజీవి అన్నారు. తాను దత్తత తీసుకున్న పేరుపాలెం సౌత్ గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. తన ఎంపీ నిధులతో పాటు కేంద్రమంత్రులను ఒప్పించి పేరుపాలెంకు మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. తానుమంత్రిగా ఉన్నప్పుడు పేరుపాలెం గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.5కోట్లు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
పేరుపాలెం గ్రామాన్ని ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దడం తన లక్ష్యమని చెప్పారు. ఇందుకు నరసాపురం ఎంపి డాక్టర్ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే మాధవనాయుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడులతో పాటు గ్రామస్థులు తమ సహాయ, సహకారాలు అందించాలని చిరంజీవి కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, పేరుపాలెం సౌత్ సర్పంచ్ సోమసత్యరంగనాథ్ పాల్గొన్నారు.

చిరంజీవి
రాజకీయాలకు అతీతంగా పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకారం అందించాలని కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె చిరంజీవి అన్నారు.

చిరంజీవి
తాను దత్తత తీసుకున్న పేరుపాలెం సౌత్ గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

చిరంజీవి
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. తన ఎంపీ నిధులతో పాటు కేంద్రమంత్రులను ఒప్పించి పేరుపాలెంకు మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు.

చిరంజీవి
తానుమంత్రిగా ఉన్నప్పుడు పేరుపాలెం గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.5కోట్లు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

చిరంజీవి
పేరుపాలెం గ్రామాన్ని ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దడం తన లక్ష్యమని చెప్పారు. ఇందుకు నరసాపురం ఎంపి డాక్టర్ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే మాధవనాయుడు, మాజీ మంత్రి కొత్తపల్లి బ్బారాయుడులతో పాటు గ్రామస్థులు తమ సహాయ, సహకారాలు అందించాలని చిరంజీవి కోరారు.












Click it and Unblock the Notifications