బోనమెత్తిన కవిత: చిందేసిన తలసాని(పిక్చర్స్)

హైదరాబాద్: మన సంస్కృతి సంప్రదాయాల్లో బోనాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నదని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపి కవిత పిలుపునిచ్చారు. బోనాల పండుగను అన్ని వర్గాలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిఐటిఏ) ఆధ్వర్యంలో ఆదివారం హైటెక్‌సిటీలోని శిల్పారామం వద్ద బోనాల ఉత్సవాలను ఎంపి కవిత బోనమెత్తి ప్రారంభించారు. శిల్పారామం నుంచి హైటెక్ సిటీ సమీపంలోని చిన్న పెద్దమ్మ దేవాలయం వరకు ఊరేగింపు కొనసాగింది.

విదేశీయులు సైతం నృత్యాలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఐటీ రంగం నిర్వహించిన ఉత్సవాల్లో తొలిసారి బోనమెత్తినట్లు కవిత చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఎన్జీవోస్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు విఠల్, ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్, టీఐటీఏ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ శివంత్‌రెడ్డి పాల్గొన్నారు.

బోనమెత్తిన గొల్కోండ

బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మూడోపూజకు గోల్కొండ బోనమెత్తింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో కోట కిక్కిరిసిపోయింది. ఆదివారం 16 తొట్టెలను వివిధ ప్రాంతాల నుంచి ఊరేగింపుగా తీసుకురావడంతో ఇక్కడ పండుగ వాతావరణం కనిపించింది. సాయంత్రం రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గోల్కొండ కోటకు వచ్చి పూజలు చేశారు. అనంతరం భక్తులతో కలిసి నృత్యం చేశారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ కూడా పూజల్లో పాల్గొన్నారు.

బోనమెత్తిన కవిత

బోనమెత్తిన కవిత

మన సంస్కృతి సంప్రదాయాల్లో బోనాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నదని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపి కవిత పిలుపునిచ్చారు.

బోనమెత్తిన కవిత

బోనమెత్తిన కవిత

తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిఐటిఏ) ఆధ్వర్యంలో ఆదివారం హైటెక్‌సిటీలోని శిల్పారామం వద్ద బోనాల ఉత్సవాలను ఎంపి కవిత బోనమెత్తి ప్రారంభించారు.

గొల్కోండ బోనాలు

గొల్కోండ బోనాలు

బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మూడోపూజకు గోల్కొండ బోనమెత్తింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో కోట కిక్కిరిసిపోయింది.

గొల్కోండ బోనాలు

గొల్కోండ బోనాలు

రెండున్నర నుంచి మూడు లక్షల మంది వరకు గోల్కొండకు తరలి రావడంతో కోట పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా జనాలే కనిపించారు.

గొల్కోండ బోనాలు

గొల్కోండ బోనాలు

కోటపైనున్న జగదాంబికామాత దర్శనం కోసం భక్తులు గంటల తరబడి నిలబడి దర్శనం చేసుకున్నారు.

గొల్కోండ బోనాలు

గొల్కోండ బోనాలు

ఆదివారం 16 తొట్టెలను వివిధ ప్రాంతాల నుంచి ఊరేగింపుగా తీసుకురావడంతో ఇక్కడ పండుగ వాతావరణం కనిపించింది.

గొల్కోండ బోనాలు

గొల్కోండ బోనాలు

సాయంత్రం రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గోల్కొండ కోటకు వచ్చి పూజలు చేశారు. అనంతరం భక్తులతో కలిసి నృత్యం చేశారు.

గొల్కోండ బోనాలు

గొల్కోండ బోనాలు

అనంతరం బోనాలను ఊరేగింపుగా గుడి వరకు శివసత్తుల నృత్యాలతో తరలించారు.

గొల్కోండ బోనాలు

గొల్కోండ బోనాలు

మూడో పూజ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కోయల్‌కార్ గోవింద్‌రాజ్ ఆధ్వర్యంలో జగదాంబిక ఆలయాన్ని పుష్పాలంకరణతో అందంగా ముస్తాబుచేశారు.

గొల్కోండ బోనాలు

గొల్కోండ బోనాలు

మాత విగ్రహం ముందు నవధాన్యాలతో పటాలను వేసి ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులు మాతకు లగ్గం (కల్యాణం) చేశారు.

గొల్కోండ బోనాలు

గొల్కోండ బోనాలు

అనంతరం బోనాలను ఊరేగింపుగా గుడి వరకు శివసత్తుల నృత్యాలతో తరలించారు.

గొల్కోండ బోనాలు

గొల్కోండ బోనాలు


డిల్లంపల్లం సంగీతంతో బోనాలను తీసుకుని వెళ్లే వారితో పాటు యువకులు, మహిళలు నృత్యాలు చేస్తూ భక్తి పారవశ్యంతో గోల్కొండ కోటపైకి నడుచుకుంటూ వెళ్లారు.

గొల్కోండ బోనాలు

గొల్కోండ బోనాలు

ఆదివారం బోనాల సందడికి ఒగ్గు కళాకారుల విన్యాసాలు హైలెట్‌గా నిలిచాయి.

చిందేసిన తలసాని

చిందేసిన తలసాని

సాయంత్రం రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గోల్కొండ కోటకు వచ్చి పూజలు చేశారు. అనంతరం భక్తులతో కలిసి నృత్యం చేశారు.

గొల్కోండ బోనాలు

గొల్కోండ బోనాలు

సాయంత్రం రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గోల్కొండ కోటకు వచ్చి పూజలు చేశారు. అనంతరం భక్తులతో కలిసి నృత్యం చేశారు.

గొల్కోండ బోనాలు

గొల్కోండ బోనాలు

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో గోల్కొండ కోట బాల హిసార్ సమీపంలో గార్డెన్‌లో దూంధాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

గొల్కోండ బోనాలు

గొల్కోండ బోనాలు

సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ కూడా పూజల్లో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+