గణేశుడి లడ్డూలను పాడుకున్న ముస్లింలు
హైదరాబాద్: తెలంగాణలో వినాయక ఉత్సవాలు మత సామరస్యాన్ని చాటాయి. ముస్లింలు వేలం పాటల్లో వినాయకుడి లడ్లను సొంతం చేసుకున్నారు. హైదరాబాదులో 45 ఏళ్ల ముస్లిం వ్యాపారవేత్త మొహమ్మద్ నజీరుద్దీన్ చాంద్రాయణగుట్ట వినాయకుడి లడ్డును పాడుకున్నారు. రూ.1.21 లక్షల రూపాయలకు ఆ లడ్డును కొనుక్కున్నాడు.
వినాయకుడి లడ్డు ప్రసాదాన్ని పొలాల్లో చల్లితే పంట బాగా పండుతుందనే నమ్మకంతోనే తాను లడ్డును పాడుకున్నట్లు ఆయన తెలిపారు తాను 2006లో కంచన్‌బాగ్ లడ్డు వేలం పాటలో పాల్గొని 11 వేల రూపాయలకు పాడుకున్నట్లు, ఆ లడ్డు ప్రసాదాన్ని నల్లగొండ జిల్లాలోని భువనగిరిలో గల తన పొలాల్లో చల్లినట్లు, ఆ తర్వాతి ఏడాది పంటలు బాగా పండినట్లు నజీరుద్దీన్ తెలిపారు. ఆయనకు యాకుత్‌పురాలో ఎలక్ట్రికల్ షాపు ఉంది.

ఇదిలావుంటే, గణేష్ లడ్డూని వేలంపాటలో ఓ ముస్లిం సోదరుడు దక్కించుకున్న సంఘటన వరంగల్‌లోని సెకండ్ బ్యాంక్ కాలనీలో జరిగింది. దీంతో అక్కడ మత సామరస్యం వెల్లివిరిసింది.
గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్బంగా ఇక్కడ ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూను వేలం పాటలో రూ. 51వేలకు మహ్మాద్ రషీద్ సొంతం చేసుకున్నాడు. లడ్డూని దక్కించిన సంతోషంలో రషీద్ మాట్లాడుతూ గణేష్ లడ్డూని దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు.
వినాయకుడి లడ్డూలు లక్షల రూపాయలు పలికిన సంఘటనలు హైదరాబాదులో పలు చోట్ల జరిగాయి. విశాఖపట్నంలోని ఓ వినాయకుడి లడ్డు అత్యధిక ధర పలికి రికార్డు సృష్టించింది.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications