ఇంట్లోనుంచే రాననుకున్నారు: బలహీనతనే బలంగా మార్చిన దీప
రియో డి జనీరో: రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం అందించిన తొలి మహిళగా రికార్డులకెక్కిన దీపా మాలిక్ వెనక ఎంతో కృషి, కఠోర శ్రమ దాగివుంది. కాళ్లు చచ్చిపడిపోవడంతో ఎంతో వేదనకు గురైన ఆమె.. తర్వాత తనకు తాను తన బలహీనతను బలంగా మార్చుకునేందుకు నిశ్చయించుకుంది.

రజత విజేత దీపా మాలిక్
ప్రస్తుతం జరుగుతున్న రియో పారాలింపిక్స్‌లో దీపా మాలిక్ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై రాష్ట్రపతి, ప్రధాని, క్రీడా, రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తూ అభినందనలు తెలిపారు. హర్యానా ప్రభుత్వం ఏకంగా రూ. 4 కోట్ల నజరానాను కూడా ప్రకటించింది. దీప సాధించిన ఘనతను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనియాడారు.

కఠోర శ్రమతోనే పతకం
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దీపా మాలిక్ మాట్లాడుతూ.. రజత పతకం సాధించడం వెనుక ఎంతోమంది కృషి, కఠోర శ్రమ దాగుందని చెప్పింది. తన కాళ్లు చచ్చుబడిపోయిన తర్వాత ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేనని అనుకున్నారని, కానీ అందరి అంచనాలను తలకిందులు చేసి తాను విజేతగా నిలిచానని ఆమె పేర్కొంది.

తొలి భారత మహిళగా రికార్డు
‘పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించడం ఆనందంగా ఉంది. అయితే ఈ పతకం వెనుక ఎంతోమంది కృషి, కఠోర శ్రమ ఉంది. నా భర్త, పిల్లలు మానసికంగా నాకెంతో శక్తినిస్తే.. కోచ్, ట్రైనర్ శారీరకంగా నన్ను బలాఢ్యురాలిని చేశారు' అని దీపా మాలిక్ తెలిపింది.

పతక విజేతగా గొప్పగా ఉంది
అంతేగాక, ‘కాళ్లు చచ్చుబడిపోయినప్పుడు నేను కనీసం ఇంటి నుంచి బయటకు రాలేనని అందరూ అనుకున్నారు. భారత్‌లో తొలి పారా బైకర్, స్విమ్మర్‌గానే కాక తొలి మహిళా పారాలింపిక్స్ పతక విజేతగా నిలవడం చాలా గొప్పగా ఉంది' అని దీపా ఆనందం వ్యక్తం చేసింది.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications