భూమిలాంటి మరో గ్రహం: కెప్లర్-452బి (వీడియో)
విశ్వంలో భూమిలాగే మరో గ్రహం ఉందని అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసా ప్రకటించింది. భూమి మాదిరే ఈ గ్రహం కూడా ఓ నక్షత్రం చుట్టూ తిరుగుతోందని, దీనికి కెప్లర్-452బి అనే పేరు పెట్టామని శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాసా వివరించింది.
ఈ గ్రహం భూమికి 1,400 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని వివరించింది. ఈ గ్రహం భూ పరిమాణంతో పోలిస్తే 60 శాతం పెద్దదని, ఆ గ్రహంపై ఉన్న వాతావరణ వివరాల గురించి మాత్రం ఖచ్చితంగా తెలియరాలేదని వెల్లడించింది.

ఈ గ్రహం రాళ్లతో నిండి భూమి కంటే ఐదు రెట్లు ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉండవచ్చని, ఈ గ్రహంపై ఒక సంవత్సరానికి 385 రోజులుంటాయని నాసా తెలిపింది. భూమికన్నా 1.5 బిలియన్ సంవత్సరాల ముందు నుంచి ఇది ఉండవచ్చని పేర్కొంది.
అయితే ఈ గ్రహం మానవ నివాసానికి అనుకూలమా? లేదా? అనే విషయాన్ని ఇప్పడే చెప్పలేమని తెలిపింది. నాసా భూమి లాంటి మరో గ్రహాన్ని కనుగొనడంపై ట్విట్టర్‌లో నాసా కెప్లర్ టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
It's the week for exoplanets. Tune-in 7/23 at 9a PDT for the latest discovery news!http://t.co/XDcHDjLs29 pic.twitter.com/zrzYl6NPbd
— NASA Kepler (@NASAKepler) July 20, 2015 After 2 months alone, me and my little friend Wilson will soon have company on the US segment of @Space_Station. pic.twitter.com/sYLkXj3BYW
— Scott Kelly (@StationCDRKelly) July 22, 2015 I love how the discovery of a potential earth-like planet is being cued up by smooth jazz #nasa #kepler http://t.co/olvoQR2W7y
— jonnylegender (@jonnylegender) July 23, 2015 











Click it and Unblock the Notifications