గాలి కూతురు పెళ్లంటే మాటలా?: శుభలేఖే ఇలావుంటే(వీడియో)
బెంగళూరు: అక్రమ మైనింగ్ కేసులో అరెస్టై ఆ తర్వాత విడుదలైన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు బ్రాహ్మణి వివాహ వేడుకకు బెంగళూరులో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఇప్పుడు ఆ పెళ్లికి సంబంధించిన శుభలేఖలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఎందుకంటే ఇంత వరకు ఎవరూ చేయని ప్రయోగం చేశారు గాలి జనార్ధన్ రెడ్డి. ఆ శుభలేఖ చూస్తేనే తన కూతురు పెళ్లి ఎంత ఘనంగా జరిపిస్తారో అనే విషయం తెలిసిపోయేలా రూపొందించారు. ఇంతకీ ఏం చేశారంటే.. శుభలేఖ ఒక బాక్సులో ఉంటుంది.. ఆ బాక్సు తెరవగానే ఎల్ఈడీ స్క్రీన్‌పై గాలి వారి వివాహ వీడియో పాట మొదలవుతుంది.
ఈ వీడియోలో జనార్ధన్ రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మితోపాటు కుమారుడు, కూతురు బ్రాహ్మణి, కాబోయే అల్లుడు రాజీవ్ రెడ్డి కనిపిస్తారు. నవంబర్ 16న జరిగే బ్రాహ్మణి, రాజీవ్‌ల వివాహానికి హాజరు కావాలంటూ ఆ పాటలో ఉంటుంది. శివలింగానికి పూజ చేస్తూ గాలి దంపతులుండగా, మిగితా వారు కూడా వారిద్దకు చేరుకుంటారు.
ప్రస్తుతం భారీ ఖర్చుతో రూపొందించిన ఈ ఎల్ఈడీ వీడియో శుభలేక దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ పాపులర్‌గా మారింది. గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లంటి మామూలు విషయమా? అన్నట్లు చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications