కల్పాకం మన అక్షయ పాత్రే: విద్యుత్ కొరతకు ఇక చెక్

చెన్నై: పురాణాల్లో అక్షయ పాత్ర గురించి విన్నాం.. కానీ అత్యాధునిక సాంకేతికత పరిఢవిల్లుతున్న ప్రస్తుత తరుణంలో అక్షయపాత్ర వంటిదే భారతీయులందరికీ అందుబాటులోకి రానున్నది. అతర్జాతీయ స్థాయిలో సగర్వంగా తలెత్తుకునేలా భారత అణు శాస్త్రవేత్తలు పరిశోధన, అభివ్రుద్ధి.. నూతన ఆవిష్కరణలో మరో అద్భుతం కనువిందు చేయబోతున్నది.

అందుకు తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై తీరం దీనికి వేదిక కానున్నది. బంగాళాఖాతం అలల కింద 15 ఏళ్లుగా నిర్మిస్తున్న కల్పక్కం అణు విద్యుత్‌కేంద్రాన్ని ఈ ఏడాది ప్రారంభించడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. దేశీయ అవసరాల కోసం పౌర అణు విద్యుత్ పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైతే విద్యుదుత్పత్తిలో భారత్‌కు ఓ అక్షయ పాత్ర దొరుకడంతోపాటు, అణువిద్యుత్ రంగం‌లో ఓ విప్లమాత్మక మార్పునకు నాంది ప్రస్తావనే కాబోతున్నది. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పై పడింది. భారత అణ్వస్త్ర శాస్త్రవేత్తలు దేశీయంగా అత్యాధునిక ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లను దిగ్విజయంగా రూపొందించారు.

దీనివల్ల సుస్థిరంగా విద్యుత్ ఉత్పత్తి కావడంతోపాటు ఫాస్ట్ బ్రీడ్ రియాకర్టర్లు ప్రధాన స్రవంతి లోకి తేవచ్చు. 1984లో తొలి యూనిట్ పని ప్రారంభిస్తే చివరి యూనిట్ 1986లో మొదలు పెట్టింది. ఈ విద్యుత్ కేంద్రాన్ని భారత అణు ఇంధన శాఖ పరిధిలో భారత జాతీయ ఇంధన సంస్థ నిర్వహిస్తున్నది. ఈ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్వహణకు అవసరమైన చర్యలన్నీ తీసుకున్నది. నిర్దేశిత ప్రమాణాలు, నిపుణుల సూచనలకు లోబడి నిర్వహిస్తున్నారు. 2004లో సునామీ, 2015లో తుఫాను, 2016లో వార్ధా తుఫాను వంటి సవాళ్లను కల్పాకం అణువిద్యుత్ కేంద్రం హాయిగా దిగ్విజయంగా అధిగమించి ముందుకు సాగుతున్నది.

ఇలా ప్రపంచం అసూయపడేలా..

ఇలా ప్రపంచం అసూయపడేలా..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అణువిద్యుత్ కేంద్రాల్లో సంప్రదాయ అణు రియాక్టర్లను మాత్రమే వినియోగిస్తున్నారు. వీటికన్నా అత్యాధునికమైన రియాక్టర్లను ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు (ఎఫ్‌బీఆర్)గా పిలుస్తారు. ఇవి సంప్రదాయ రియాక్టర్లకన్నా దాదాపు 70 శాతం అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతోపాటు అవి చాలా సురక్షితమైనవి. ఎఫ్‌బీఆర్‌ల నుంచి అణువ్యర్థాలు చాలా తక్కువ మోతాదులో విడుదలవుతాయి కనుక వ్యర్థాల నిర్వహణ సమస్య పరిష్కారమైనట్టే. సంప్రదాయ రియాక్టర్ల నిర్వహణ చాలా సంక్లిష్టంగా ఉంటుంది.

వీటిని ఎక్కువ కాలంపాటు నడిపితే ప్రోటాన్ల చర్యలు అస్థిరంగా మారుతాయి. దీంతో విద్యుదుత్పత్తిలో హెచ్చుతగ్గులు వస్తాయి. ఎఫ్‌బీఆర్‌లు ఈ సమస్యలకు పరిష్కారం చూపాయి. ఇవి తక్కువ అణుపదార్థం వినియోగంతో ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి. ప్రస్తుతం రష్యా మాత్రమే ఎఫ్‌బీఆర్‌లను తయారు చేస్తూ అణు విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నది. ఇప్పుడు దీనికన్నా అత్యాధునికమైన సాంకేతిక పరిజానంతో ఉపయోగించి భారత శాస్త్రవేత్తలు ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్‌బీఆర్)ను రూపొందించారు.

దూసుకెళ్తున్న రష్యా, భారత్

దూసుకెళ్తున్న రష్యా, భారత్

కల్పాకం అణు విద్యుత్ కేంద్రంలో దీనిని 27 ఏళ్లుగా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. కల్పక్కం రియాక్టర్ భారత అణు, విద్యుత్ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకబోతున్నదని కల్పక్కంలోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటమిక్ రీసెర్చ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ భాదురి చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్ల నిర్మాణంలో రష్యా, భారత్ దూసుకుపోతుంటే విదేశాలు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నా యి. ఈ విషయంలో అమెరికా ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నది. భవిష్యత్ అణు రియాక్టర్ల నిర్మాణంపై చర్చించేందుకు ఇటీవల ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ (ఐఏఈఏ) ఆధ్వర్యంలో రష్యాలోని యెకటెరింగ్‌బర్గ్ నగరంలో సదస్సు జరిగింది. ఇందులో దాదాపు 30 దేశాలకు చెందిన 700 మందికి పైగా అణు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఇక్కడ అణువ్యర్థాల నిర్వహణపైన కూడా చర్చ జరిగింది.

ప్రొటోటైఫ్ ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్లు కీలకం

ప్రొటోటైఫ్ ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్లు కీలకం

మనకు ప్రకృతిలో అణు మూలకాలు యురేనియం, ప్లుటోనియం, థోరియం తదితర రూపాల్లో లభిస్తాయి. సంప్రదాయ న్యూక్లియర్ రియాక్టర్లలో యురేనియం-235ని ఇంధనంగా వాడుతారు. యూ-238 మూలకాన్ని బాగా శుద్ధి చేసినప్పుడు అతితక్కువ స్థాయిలో ఇది లభిస్తుంది. దీంతో యూ-238 వ్యర్థాలు భారీగా పేరుకుంటున్నాయి. వీటి నిర్వహణ పెద్ద సమస్యగా మారింది. ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్లు ఈ సమస్యకు పరిష్కారం చూపుతున్నాయి. ఇవి నేరుగా యూ-238ను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయగలవు. దీంతో ఇంధన కొరత తీరడంతోపాటు అణు వ్యర్థాలు అతి తక్కువ స్థాయిలో విడుదలవుతాయి.

యూ-238 వినియోగించగా విడుదలయ్యే ఇతర మూలకాలను సైతం ఎఫ్‌బీఆర్‌లు ఇంధనంగా వాడుకోవడంతో నిరంతరాయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవు. రష్యా రూపొందించిన బీఎన్-800 రియాక్టర్‌లో యురేనియంతోపాటు ప్లుటోనియంను ఇంధనంగా వాడుతున్నారు. భారత్ రూపొందించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్(పీఎఫ్‌బీఆర్) వీటన్నింటికన్నా అత్యాధునికమైనది. ఇది థోరియంను, యూ-233ను ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. ప్రపంచంలోనే అత్యధికంగా థోరియం నిల్వలు ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉన్నది. దీంతో పీఎఫ్‌బీఆర్‌లకు ఇంధన కొరత ఉండదు. కాబట్టే వీటిని భారత అక్షయపాత్రలుగా పిలుస్తున్నారు.

ఇలా వనరులు కూడదీసుకున్న రష్యా

ఇలా వనరులు కూడదీసుకున్న రష్యా

రష్యా అణు విద్యుత్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్నది. దీనికి ప్రధాన కారణం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల ఆవిష్కరణపై రష్యా భారీగా పెట్టుబడులు పెట్టడమే. రష్యా 1980లోనే బీఎన్ - 600 పేరుతో ఎఫ్‌బీఆర్‌ను రూపొందించింది. దీనిని వాణిజ్య స్థాయిలో రూపొందించాలనుకున్నా 1991లో సోవియట్ పతనంతో పరిస్థితులు సహకరించలేదు. ఆ తర్వాత రష్యా సొంతం గా వనరులు సమకూర్చుకొని బీఎన్ - 800 ఫాస్ట్ బ్రీడర్ అణు రియాక్టర్‌ను రూపొందించింది. దీనిని యెకరెరింగ్‌బర్గ్ నగర సమీపంలోని యూరల్ పర్వతశ్రేణిలో నెలకొల్పిన బెలోయార్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ఏర్పాటు చేసింది. ఇందులో 2016 నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. ఈ రియాక్టర్ పూర్తిగా సెన్సార్లతో పనిచేస్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+