హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సింధుకు ఘన సన్మానం: ముద్దు పెట్టారు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రియో ఒలింపిక్స్ పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును మెహిదీపట్నంలోని సెయింట్స్ ఆన్స్ కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కాగా, పీవీ సింధు కళాశాలలో అడుగుపెట్టగానే సింధు, సింధు అంటూ నినాదాలు, కేరింతలు కొడుతూ హోరెత్తించారు విద్యార్థులు.

 సెల్పీల సందడి

సెల్పీల సందడి

మంగళవారం సింధు మెహిదీపట్నం సెయింట్‌ ఆన్స్‌ కళశాలకు విచ్చేశారు. సెయింట్‌ ఆన్స్‌ కళాశాల్లో చదువుతున్న సింధు.. 2016లో రియో ఒలింపిక్స్‌లో సిల్వర్‌ పతకం సాధించడంతో కళాశాల యాజమాన్యం ఆమెను స్వాగతించింది.

హాజరైన పీవీ సింధు

హాజరైన పీవీ సింధు

సింధు సాధించిన విజయం భారతదేశానికే గర్వకారణం అని పలువురు కొనియాడారు. సింధు వెంట ఆమె తల్లిదండ్రులు విచ్చేశారు.

అలరించిన నృత్యాలు

అలరించిన నృత్యాలు

కళాశాలలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు మధ్య సింధును ఘనంగా సన్మానించారు.

ఆకట్టుకున్న ప్రదర్శనలు

ఆకట్టుకున్న ప్రదర్శనలు

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సిస్టర్‌ అమృత, మౌనిక, నమాన్‌, విజయనగర్‌ కాలనీ పాఠశాల ప్రిన్సిపాల్‌ రోజి, మదీనాగూడ పాఠశాల ప్రిన్సిపాల్‌ పుష్పలీలాతో పాటు మెహిదీపట్నం సెయింట్‌ ఆన్స్‌ కళాశాల విభాగం ఇన్‌చార్జ్‌ విమలారెడ్డి పాల్గొన్నారు.

ఘన సన్మానం

ఘన సన్మానం

రియో ఒలింపిక్స్ పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును మెహిదీపట్నంలోని సెయింట్స్ ఆన్స్ కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కాగా, పీవీ సింధు కళాశాలలో అడుగుపెట్టగానే సింధు, సింధు అంటూ నినాదాలు, కేరింతలు కొడుతూ హోరెత్తించారు విద్యార్థులు.

 ముద్దు పెట్టి..

ముద్దు పెట్టి..

పీవీ సింధును సెయింట్ ఆన్స్ కళాశాల యాజమాన్యం మంగళవారం ఘనంగా సన్మానించింది. అనంతరం ఆమెకు ముద్దు పెట్టి ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ప్రసంగం

ప్రసంగం

తాను రియో ఒలింపిక్స్ వెళుతున్న సమయంలో కళాశాల యాజమాన్యం, సహచర విద్యార్థులు తాను పతకం తెస్తాననే నమ్మకం ఉంచారని, వారి నమ్మకాన్ని నిలబట్టడం సంతోషంగా ఉందని పీవీ సింధు అన్నారు.

అలరించాయి

అలరించాయి

వేదికపైనే విద్యార్థులు ఇచ్చిన బ్యాడ్మింటన్ ప్రదర్శన అహుతులను ఆకట్టుకుంది. విద్యార్థులు సంస్కృతిక కళా ప్రదర్శనల్లో చురుకుగా పాల్గొన్నారు.

కట్టిపడేశారు

కట్టిపడేశారు

సెయింట్ ఆన్స్ కళాశాల విద్యార్థినులు చేసిన పలు ప్రదర్శనలు అందర్నీ కట్టిపడేశాయి. వీక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి.

 నృత్య ప్రదర్శన

నృత్య ప్రదర్శన

సెయింట్ ఆన్స్ కళాశాల విద్యార్థినులు తమ కళా ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు ప్రదర్శనల్లో మంచి సందేశాన్ని కూడా అందించారు.

English summary
"I will forever remember the warm send off the college gave me before I left for the Olympics," recalled the lanky shuttler. "Here’s what I brought back," said P.V. Sindhu, flashing the famed silver medal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X