కాంగ్రెస్‌కు '44': రాహుల్‌గాంధీ బర్త్ డే (పిక్చర్స్)

హైదరాబాద్: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ 44వ జన్మదిన వేడుకలను పార్టీ కార్యకర్తలు గురువారం ఢిల్లీలో ఘనంగా జరుపుకున్నారు. రాహుల్ మాత్రం విదేశీ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధికారిక నివాసం 10 జన్‌పథ్ వద్ద పార్టీ నేత జగదీష్ శర్మ నేతృత్వంలో కార్యకర్తలు 44 కిలోల కేక్‌ను కోసి వేడుకలు జరుపుకున్నారు.

ఏసీసీసీ ప్రధాన కార్యాలయంలో డప్పు చప్పుళ్లు, బాణాసంచా పేలుళ్ల మధ్య రాహుల్ జన్మదిన వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి రాహుల్ ప్రధాన కారకుడని పార్టీకి చెందిన పలువురు నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోను రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ భవన్లో తెలంగామ ప్రాంత నేతలు కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కాగా, యాదృచ్ఛికమే అయినా... ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ దేశవ్యాప్తంగా 44 లోకసభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.

టి నేతలు

టి నేతలు

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు గురువారం గాంధీ భవన్లో ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేస్తున్న టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య.

టి నేతలు

టి నేతలు

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు గురువారం గాంధీ భవన్లో ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. నేతలకు కేక్ కట్ తినిపిస్తున్న పొన్నాల లక్ష్మయ్య.

టి నేతలు

టి నేతలు

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు గురువారం గాంధీ భవన్లో ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. షబ్బీర్ అలీకి కేక్ కట్ తినిపిస్తున్న పొన్నాల లక్ష్మయ్య.

టి నేతలు

టి నేతలు

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు (టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత షబ్బీర్ అలీ) తదితరులు సమావేశమైన దృశ్యం.

చిన్నారులు

చిన్నారులు

ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ 44వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఓ పాఠశాల విద్యార్థులు.. రాహుల్ మాస్కులు ధరించి, పలకల పైన హ్యాపీ బర్త్ డే టు రాహుల్ గాంధీ అంటూ రాసిన దృశ్యం.

చిన్నారులతో టి నేత

చిన్నారులతో టి నేత

ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ 44వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఓ పాఠశాల విద్యార్థులు.. రాహుల్ మాస్కులు ధరించి, పలకల పైన హ్యాపీ బర్త్ డే టు రాహుల్ గాంధీ అంటూ రాసిన దృశ్యం. ఓ చిన్నారితో టి నేత.

చిన్నారులు

చిన్నారులు

ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ 44వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఓ పాఠశాల విద్యార్థులు.. రాహుల్ మాస్కులు ధరించి, పలకల పైన హ్యాపీ బర్త్ డే టు రాహుల్ గాంధీ అంటూ రాసిన దృశ్యం.

చిన్నారులు

చిన్నారులు

ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ 44వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఓ పాఠశాల విద్యార్థులు.. రాహుల్ మాస్కులు ధరించి, పలకల పైన హ్యాపీ బర్త్ డే టు రాహుల్ గాంధీ అంటూ రాసిన దృశ్యం. ఓ చిన్నారితో టి నేత.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+