రైడ్: యువతులు ముసుగేశారు, కూల్(పిక్చర్స్)
హైదరాబాద్: మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో సుమారు గంట సేపు ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరంలో వాతావరణం ఒక్కసారి చల్లబడింది.
దీంతో మధ్యాహ్నం వరకు కూడా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరితో గురైన నగరవాసులకు కాస్త ఉపశమనం కల్గింది. అంతేగాక, వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది.
ముఖ్యంగా నగరంలోని బేగంపేట, పంజాగుట్ట, బల్కంపేట, సికిందరాబాద్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాలతో పాటు శివార్లలోని వనస్థలిపురం, ఎల్బీ నగర్ దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో దాదాపు గంటసేపు ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది.

వర్షం
మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. ఆ తర్వాత కాసేపటికి వర్షం తగ్గాక ఓ జంట దిల్‌సుఖ్ నగర్‌లోని రోడ్డుపై ద్విచక్ర వాహనంపై దూసుకెళ్తూ...

వర్షం
మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. ఆ తర్వాత కాసేపటికి వర్షం తగ్గాక ఓ మహిళ పిల్లలతో దిల్‌సుఖ్ నగర్‌లోని రోడ్డుపై ద్విచక్రవాహనంపై వెళ్తూ...

వర్షం
హైదరాబాదు నగరంలో నిత్యం రద్ధీగా ఉండే పలు మెయిన్‌రోడ్లు, కూడళ్లలో ఈ వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ముఖ్యంగా పంజాగుట్ట చౌరస్తా నుంచి అటూ ఖైరతాబాద్ వెళ్లే దారిలో, అలాగే అమీర్‌పేట నుంచి బేగంపేట మీదుగా సికిందరాబాద్‌కు వచ్చే మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

వర్షం
బేగంపేట పబ్లిక్‌స్కూల్ నుంచి సికిందరాబాద్‌కు చేరుకునేందుకు వాహనదారులకు కనీసం గంట సమయం పట్టింది. నిత్యం రద్ధీగా ఉండే పలు మెయిన్ రోడ్లు, ఇరుకుగా ఉన్న మలుపులు, వాటర్ స్టాగినేషన్ అయ్యే పాయింట్లలో ట్రాఫిక్ సమస్య బాగా తలెత్తింది.

వర్షం
పలు మెయిన్ రోడ్లలో భారీగా వర్షపు నీరు నిల్చి ఉండటంతో చిన్న సైజు చెరువులను తలపించాయి. వాటర్ స్టాగినేషన్ పాయింట్లకు చేరుకున్న బల్దియా సిబ్బంది, వర్షపు నీటిని మోటార్ల సహాయంతో తోడివేశారు.

వర్షం
మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. ఆ తర్వాత కాసేపటికి వర్షం తగ్గాక ఓ జంట ఎర్రమంజిల్‌లో రోడ్డుపై ద్విచక్ర వాహనంపై దూసుకెళ్తూ...

వర్షం
మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. వర్షంలోనే ద్విచక్ర వాహనంపై వెళ్తూ తలకు చేతి రుమాలు కట్టుకున్న ఓ ద్విచక్రవాహనదారుడు.

వర్షం
పలు మెయిన్ రోడ్లలో భారీగా వర్షపు నీరు నిల్చి ఉండటంతో చిన్న సైజు చెరువులను తలపించాయి. వాటర్ స్టాగినేషన్ పాయింట్లకు చేరుకున్న బల్దియా సిబ్బంది, వర్షపు నీటిని మోటార్ల సహాయంతో తోడివేశారు.

వర్షం
మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. ఆ తర్వాత కాసేపటికి వర్షం తగ్గాక ఓ ఫ్యామిలీ సోమాజిగూడలోని రోడ్డుపై ద్విచక్రవాహనంపై వెళ్తూ...

వర్షం
మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో సుమారు గంట సేపు ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరంలో వాతావరణం ఒక్కసారి చల్లబడింది.












Click it and Unblock the Notifications