వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కటైన రోహిత్ శర్మ-రితిక: సచిన్ సహా..(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

ముంబై: టీమిండియా స్టైలిష్ ఆటగాడు రోహిత్ శర్మ ఓ ఇంటివాడయ్యాడు. తన బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలుకుతూ ఆదివారం తన ప్రేయసి రితికా సజ్దేను వివాహమాడాడు. బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ హోటల్లో వీరి వివాహం ఘనంగా జరిగింది.

పెళ్లి కోసం రోహిత్ శర్మ డిజైనర్ షేర్వాణిలో ముస్తాబయ్యాడు. రితికా కూడా పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయింది. ఆదివారం మధ్యాహ్నం వివాహం జరగ్గా.. రాత్రి విందు ఏర్పాటు చేశారు. రోహిత్ వివాహానికి అతిరథ మహారథులు హాజరయ్యారు.

ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ కుటుంబసభ్యులు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆయన సతీమణి అంజలి, భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్ దంపతులు, యువరాజ్ సింగ్, ఆయనకు కాబోయే భార్య హజెల్ కీచ్, ఛటేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, తదితర ప్రముఖులు రోహిత్ వివాహానికి హాజరయ్యారు.

బెంగళూరులో విజయ్ హాజరే ట్రోఫీ ఆడుతున్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రోహిత్ వివాహానికి హాజరుకాలేకపోయాడు. కాగా, సురేష్ రైనా, దినేశ్ కార్తీక్, హర్భజన్ సింగ్‌ల తర్వాత ఈ ఏడాది వివాహ చేసుకున్న భారత ఆటగాడు రోహిత్. యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కే అవకాశం ఉంది.

రోహిత్-రితిక

రోహిత్-రితిక

టీమిండియా స్టైలిష్ ఆటగాడు రోహిత్ శర్మ ఓ ఇంటివాడయ్యాడు. తన బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలుకుతూ ఆదివారం తన ప్రేయసి రితికా సజ్దేను వివాహమాడాడు.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ హోటల్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి కోసం రోహిత్ శర్మ డిజైనర్ షేర్వాణిలో ముస్తాబయ్యాడు. రితికా కూడా పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయింది.

సచిన్ దంపతుల హాజరు

సచిన్ దంపతుల హాజరు

ఆదివారం మధ్యాహ్నం వివాహం జరగ్గా.. రాత్రి విందు ఏర్పాటు చేశారు. రోహిత్ వివాహానికి అతిరథ మహారథులు హాజరయ్యారు.

ప్రియురాలితో హాజరైన యూవీ

ప్రియురాలితో హాజరైన యూవీ

ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ కుటుంబసభ్యులు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆయన సతీమణి అంజలి, భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్ దంపతులు, యువరాజ్ సింగ్, ఆయనకు కాబోయే భార్య హజెల్ కీచ్, ఛటేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, తదితర ప్రముఖులు రోహిత్ వివాహానికి హాజరయ్యారు.

అంబానీ కుటుంబం

అంబానీ కుటుంబం

రోహిత్ శర్మ వివాహానికి హాజరైన ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ కుటుంబం.

మోడీకి ఆహ్వానం

మోడీకి ఆహ్వానం

ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని తన వివాహానికి ఆహ్వానిస్తున్న రోహిత్ శర్మ

రోహిత్-రితికలతో సోనాక్షి

రోహిత్-రితికలతో సోనాక్షి

రోహిత్ శర్మ-రితికల వివాహానికి హాజరైన బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, తదితరులు.

English summary
India batsman Rohit Sharma began a new innings in life as he married his longtime girlfriend Ritika Sajdeh in Mumbai on Sunday (December 13).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X