కోహ్లీ దంచి కొట్టినా అనుష్క దిగాలు (పిక్చర్స్)

బెంగళూరు: విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ సన్ రైజర్స్ హైదరాబాద్‌పై సోమవారం తలపడిన సమయంలో అనుష్క శర్మ స్టాండ్స్‌లో కనిపించారు. రాయల్ చాలెంజర్స్ ఓటమితో ఆమె దిగాలు పడినట్లు కనిపించారు.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో సునాయసంగా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏబీ డివిల్లీర్స్‌ (28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46)తో కలిసి విరాట్‌ కోహ్లీ (37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41) దూకుడుగా ఆడాడు.

తొలుత బౌలింగులో రాణించడంతో హైదరాబాద్‌కు విజయం దక్కింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' డేవిడ్‌ వార్నర్‌ (27 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 57), శిఖర్‌ ధావన్‌ (42 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 నాటౌట్‌) దూకుడు ప్రదర్శించారు. దాంతో బెంగళూరు నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ అలవోకగా ఛేదించింది.

అనుష్క శర్మ ఇలా...

అనుష్క శర్మ ఇలా...

విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడిన సమయంలో అనుష్క శర్మ ఇలా..

నిరాశ పరిచిన గేల్

నిరాశ పరిచిన గేల్

క్రిస్‌ గేల్‌ 16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 21 పరుగులు చేసి అవుటయ్యాడు. పెద్దగా రాణించకుండా అతను నిరాశపరిచాడు.

విరాట్ కోహ్లీ ఇలా..

విరాట్ కోహ్లీ ఇలా..

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడి స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు.

సన్ రైజర్స్ ఆనందం...

సన్ రైజర్స్ ఆనందం...

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ బ్యాట్స్‌మన్ మణదీప్ సింగ్‌ను ఔట్ చేసిన ఆనందాన్ని పంచుకుంటున్న సన్ రైజర్స్

అద్భుతమైన క్యాచ్...

అద్భుతమైన క్యాచ్...

మణదీప్ సింగ్ కొట్టిన బంతిని డైవ్ చేసి అందుకున్న సన్ రైజర్స్ ఫీల్డర్ డేవిడ్ వార్నర్..

డీవిల్లీర్స్ ఔటైన ఆనందం...

డీవిల్లీర్స్ ఔటైన ఆనందం...

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ స్టార్ ప్లేయర్ డీ విల్లీర్స్‌ను అవుట్ చేసిన ఆనందంలో సన్ రైజర్స్ సభ్యులతో ట్రెంట్ బౌల్ట్..

రవి బొపారా బౌలింగులో...

రవి బొపారా బౌలింగులో...

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ రవి బొపారా బౌలింగులో విరాట్ కోహ్లీ ఇలా అవుటయ్యాడు.

సామీ ఇలా అవుట్

సామీ ఇలా అవుట్

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ బ్యాట్స్‌మన్ డారెన్ సామీ వికెట్లు ఇలా రాలిపడ్డాయి..

డేవిడ్ వార్నర్...

డేవిడ్ వార్నర్...

రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దూకుడు ఇలా...

శిఖర్ ధావన్...

శిఖర్ ధావన్...

డేవిడ్ వార్నర్‌తో కలిసి హైదరాబాద్ సన్ రైజర్స్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ తన దూకుడును చూపించాడు.

విరాట్ కోహ్లీ ఇలా...

విరాట్ కోహ్లీ ఇలా...

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో సోమవారంనాడు జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీ ఇలా కనిపించాడు...

లోకేష్‌ రాహుల్‌ (28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 44 నాటౌట్‌) మంచి సహకారం అందించాడు. దీంతో హైదరాబాద్‌ మరో 16 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. బెంగళూరు బౌలర్లలో చాహల్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

ప్రవీణ్‌ వేసిన పదో ఓవర్లో 4, 6 బాదిన కోహ్లీ ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ తర్వాతి ఓవర్లోనే కార్తీక్‌ అవుటయ్యాడు. అతని స్థానంలో వచ్చిన డివిల్లీర్స్‌ భారీ షాట్లు ఆడుతూ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. హాఫ్‌ సెంచరీకి చేరువైన కోహ్లీ బొపారా వేసిన బంతికి పెవిలియన్ చేరుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+