హలీం పెస్టివల్: వాహ్! ఏం రుచి!! (పిక్చర్స్)

హైదరాబాద్: రంజాన్ పర్వదినం సందర్భంగా హైదరాబాదులోని శిల్పారామంలో హలీం ఫెస్టివల్ రంజింపజేసింది. గజల్‌ గానామృతం, అరేబియన్‌ మర్ఫా, ఖవ్వాలీ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తే పసందైన హలీం, బిర్యానీ రుచులు జిహ్వచాపల్యాన్ని తీర్చాయి.

ఈ ఆనందానుభూతులను అందించడానికే జీహెచ్‌ఎంసీతో కలిసి తెలంగాణ హోటల్స్‌ అసోసియేషన్‌ హలీం ఫెస్టివల్‌ను శిల్పా రామంలోని శిల్పసంధ్యావేదికలో నిర్వహించింది. శుక్రవారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకూ జరిగిన ఈ ఫెస్టివల్‌ నగర వాసులను ఆకట్టుకుంది. పెద్దఎత్తున హాజరయ్యారు.

పిస్తా హౌజ్‌ మొదలుకుని షాబాద్‌, సర్వీ, హైలైన్‌ వంటి 22 హోటల్స్‌, రెస్టారెంట్లు తమ పసందైన హలీం, బిర్యానీ, కబాబ్‌ల రుచులను నగరవాసులకు అందించటానికి పోటీపడ్డాయి. రంజాన్‌ మాసం పురస్కరించుకుని ఈ హలీం ఫెస్టివల్‌ ఏర్పాటు చేశా మని తెలంగాణా హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగరాజు చెబుతూ దాదాపు 30 స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేశామని అన్నారు.

ఈ నెల 26, 27 తేదీల్లో శిల్పారామంలోనే బోనాల వేడుకలను కూడా నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌తో పాటుగా శేరిలిం గంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.

పంచుకుంటూ మహిళలు

పంచుకుంటూ మహిళలు

హలీం రుచులను మహిళలు పరస్పరం పంచుకుంటూ మధురానుభూతికి లోనయ్యారు. శిల్పారామంలో శుక్రవారం ఏర్పాటైన హలీం ఫెస్టివల్‌లో ఓ దృశ్యం ఇది.

వారెవ్వా ఏమి రుచులు...

వారెవ్వా ఏమి రుచులు...

శిల్పారామంలో ఏర్పాటైన హలీం ఫెస్టివల్‌కు వచ్చిన హైదరాబాదీలకు ఇలా వివిధ వంటకాల రుచులను చవిచూపిస్తూ...

దొరుకునా ఇటువంటి రుచి....

దొరుకునా ఇటువంటి రుచి....

దొరుకునా ఇటువంటి రుచి అంటూ ఇలా హలీంను పంచుకుంటూ ఆరగిస్తూ మధురానుభూతికి లోనయ్యారు.

పంచుకుందాం...

పంచుకుందాం...

ఒకే పాత్రలోని దక్కనీ వంటకాల రుచులను కలిసి పంచుకుని అనుబంధాన్ని పటిష్టపరుచుకుందామన్నట్లుగా...

మేమేమీ తక్కువ తినలేదు...

మేమేమీ తక్కువ తినలేదు...

హలీం ఫెస్టివల్‌లో తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా యువతరం ఇలా పాత వంటకాలను కొత్తగా రుచి చూస్తూ..

హలీం ఇలాగే....

హలీం ఇలాగే....

హలీం ఇలాగే ఉంటుందా అన్నట్లుగా, దాని రుచిని చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లుగా వీళ్లు ఇలా కనిపించారు.

పంచుకుందాం రండి...

పంచుకుందాం రండి...

ఒక్కో వంటకం రుచిని చవిచూస్తూ అందులోని అనుభూతిని అనుభవిస్తూ యువతలు తమ జిహ్వచాపల్యానికి పని పెట్టారు.

సందడే సందడి..

సందడే సందడి..

హైదరాబాదులోని శిల్పారామంలో ఏర్పాటైన హలీం ఫెస్టివల్‌లో యువతీయువకుల సందడి కనిపించింది. కొత్తతరానికి ఇదో కొత్త అనుభవం...

ఇది తిని చూడు...

ఇది తిని చూడు...

ఇది తిని చూడు.. ఎంత రుచిగా ఉంటుందో ఆస్వాదించు అంటున్నట్లుగా యువతికి ఓ వంటకాన్ని అందిస్తూ ఇలా..

హలీం రుచి మాత్రమే కాదు...

హలీం రుచి మాత్రమే కాదు...

హలీంను రుచి చూడడమే కాదు, అది చూడడానికి ఎలా ఉంటుందో కూడా పరిశోధిస్తున్నట్లుగా వాళ్లు ఇలా...

ఎలా ఉంటుంది...

ఎలా ఉంటుంది...

ఇదెలా ఉంటుందో చూద్దాం, ఆరగిద్దామన్నట్లుగా ఒకరికొకరు అందించుకుంటూ, ఒకరి నుంచి మరొకరు తీసుకుంటూ ఇలా...

తిని చూస్తా....

తిని చూస్తా....

ఇదేమిటో తిని చూస్తానంటూ తల్లిదండ్రులు చేతబట్టుకున్న పాత్రల్లోంచి తీసుకుంటూ పిల్లలు ఇలా రుచి చూశారు.

ఆటలూ పాటలూ...

ఆటలూ పాటలూ...

దక్కన్ సంస్కృతీసంప్రదాయాలను ప్రతింబించే విధంగా ఖవ్వాలీ, గజల్ గానామృతం హైదరాబాదీలను అలరించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+