ఖైరతాబాద్ మహా గణపతికి వీడ్కోలు (పిక్చర్స్)

హైదరాబాద్: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీకైలాస విశ్వరూప మహాగణపతి సుమారు 20 గంటల శోభాయాత్ర అనంతరం గంగమ్మ ఒడిలోకి చేరాడు. 11 రోజుల పాటు భక్తులతో నీరాజనాలు అందుకున్న గౌరీ తనయున్ని వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఖైరతాబాద్‌లో 60 అడుగుల ఎత్తు, 20 వెడల్పుతో కొలువుదీరిన గణనాథుని నిమజ్జనాన్ని త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉత్సవ కమిటీ సోమవారం ఉదయమే పార్వతీ తనయునికి ఇరువైపులా ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ, శ్రీ లక్ష్మీనర్సింహస్వామి విగ్రహాలకు ఉన్న కర్రలను తొలగించారు.

అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో లంబోదరుడి విగ్రహానికి ఉన్న షెడ్, కర్రల తొలగింపు ప్రారంభించి సాయంత్రం 4 గంటల కల్లా ఆ తంతు పూర్తి చేశారు. తదుపరి స్వామి వారికి ప్రత్యేక పూజల నిర్వహించిన ఉత్సవ కమిటీ, 7:30 ప్రాంతంలో శ్రీలక్ష్మీనర్సింహాస్వామి విగ్రహాన్ని తీసి పక్కన పెట్టారు. అనంతరం 8:30 గంటలకు గజముఖుని హస్తంలో ఒదిగిన ఐదు వేల కేజీల లడ్డూను కిందకు దించారు. 9:50 సమయంలో దుర్గామాత విగ్రహాన్ని వాహనంపైకి ఎక్కించారు.

అనంతం 10:30 నిమిషాలకు భారీ గణనాథుని విగ్రహాన్ని కదిలించారు. 10:55కి వాహనంపై ఎక్కించారు. 11 గంటలకు ప్రారంభమైన వెల్డింగ్ పనులు మంగళవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. మంగళవారం ఉదయం 10:15 నిమిషాలకు కొంచెం ముందుకు కదిలిన గణనాథుడు మెల్లమెల్లగా ముందుకు సాగాడు. దీంతో ఉత్సవ కమిటీ శోభాయాత్రను ప్రారంభించింది.

మహా గణపతి శోభా యాత్ర

మహా గణపతి శోభా యాత్ర

చిత్తూరు నుంచి వచ్చిన టిటిడికి చెందిన కళాకారులు లయబద్ధంగా నృత్యాలు చేస్తుండగా ఖైరతాబాద్ మహా గణపతి ముందుముందుకు వెళ్లసాగాడు.

మహా గణపతి శోభాయాత్ర

మహా గణపతి శోభాయాత్ర

మంగళవారం మధ్యాహ్నం 12:05 నిమిషాలకు రాజ్‌దూత్ చౌరస్తా, 12:20 నిమిషాలకు టెలిఫోన్‌భవన్ చేరుకున్న గణనాథుడు, 1 నుంచి 1:55 వరకు తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద నిలిపివేశారు.

మహా గణపతి శోభాయాత్ర

మహా గణపతి శోభాయాత్ర

మంగళవారం సాయంత్రం 3:30 నిమిషాలకు ఎన్‌టిఆర్ మార్గ్ మీదుగా 4గంటల సమయంలో క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఉత్సవ కమిటీ గణపతికి కలశపూజ నిర్వహించిన అనంతరం క్రేన్ వైర్లను అమర్చారు.

మహా గణపతి శోభాయాత్ర

మహా గణపతి శోభాయాత్ర

మంగళవారం సాయంత్రం గం. 6:15 నిమిషాలకు మహాహారతి అనంతరం మెల్లిమెల్లిగా పైకి లేపుతూ 6:44 నిమిషాలకు గంగమ్మ ఒడిలోకి మహాగణపతి ఒదిగిపోయాడు.

మహాగణపతి శోభాయాత్ర

మహాగణపతి శోభాయాత్ర

రెండు రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగిన ఖైరతాబాద్ వినాయకుని విగ్రహం ఊరేగింపు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి కావడంతో అధికారులు, ఉత్సవ కమిటీ ఊపిరి పీల్చుకున్నారు.

మహాగణపతి శోభాయాత్ర

మహాగణపతి శోభాయాత్ర

20 గంటల సుదీర్ఘ శోభాయాత్ర తర్వాత వినాయకుడు గంగను చేరాడు. భారీ క్రేన్ల సాయంతో అధికారులు విజయవంతంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు.

మహాగణపతి శోభాయాత్ర

మహాగణపతి శోభాయాత్ర

హైదరాబాదులోని హుస్సేన్ సాగర్‌లో మహాగణపతి నిమజ్జనాన్ని సందర్శించడానికి పెద్ద యెత్తున ప్రజలు రావడంతో నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ కిటకిటలాడాయి.

మహా గణపతి శోభాయాత్ర

మహా గణపతి శోభాయాత్ర

మహా గణపతి నిమజ్జనం స్థలానికి చేరుకోగానే ఉత్సవ కమిటీ తుది పూజలు చేసింది. భారీ క్రేన్ల సాయంతో గణపతి జలప్రవేశం చేశాడు. హైదరాబాదులో వినాయక విగ్రహాల నిమజ్జనం రెండు రోజుల పాటు భారీగా నడిచింది.

మహా గణపతి శోభాయాత్ర

మహా గణపతి శోభాయాత్ర

ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర కన్నులపండుగగా సాగింది. ఖైరతాబాద్ నుంచి సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైన మహా గణపతి శోభాయాత్ర తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా మంగళవారం మధ్యాహ్నానికి సచివాలయం చేరుకుంది.

మహా గణపతి శోభాయాత్ర

మహా గణపతి శోభాయాత్ర

ఖైరతాబాద్ మహా గణపతి గంగకు కదిలిపోతున్న దృశ్యాన్ని ప్రజలు ఇలా భవంతులపై నుంచి ఆసక్తిగా చూశారు.

సెల్‌ఫోన్‌లో బంధిస్తున్న యువతి

సెల్‌ఫోన్‌లో బంధిస్తున్న యువతి

ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర అపురూప దృశ్యాలను ఆటోలోంచి ఓ యువతి ఇలా ఆసక్తిగా చిత్రీకరించింది.

మహా గణపతి శోభాయాత్ర

మహా గణపతి శోభాయాత్ర

ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రను యువకులు చెట్లపైకి ఎక్కి ఆసక్తిగా చూస్తూ తమ సెల్ ఫోన్లలో బంధించడానికి ప్రయత్నించారు.

మహా గణపతి శోభాయాత్ర

మహా గణపతి శోభాయాత్ర

ఓ యువతి ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రను తన సెల్‌ఫోన్‌లో బంధించడానికి ప్రయత్నిస్తూ ఇలా కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+