చేనేత వన్నెల చీరెపై పింకీరెడ్డి మోజు (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ సోషలైట్, జివికె డైరెక్టర్ పింకీ రెడ్డి చేనేత దుస్తులపై మోజు పెంచుకోవాల్సిన అవసరాన్ని చెప్పారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వీవర్స్ ఇండియా హ్యాండ్లూమ్ రెండో స్టోర్‌ను ఆమె ప్రారంభించారు. దానిలోని డిజైనర్ స్టూడియోను పద్మశ్రీ భారత మాస్టర్ హ్యాండ్లూమ్ డిజైనర్ గాజం అంజయ్య ప్రారంభించారు.
చేనేతకారుల శ్రమ, నైపుణ్యం మాటల్లో మాటల్లో చెప్పలేనిదని పింకీరెడ్డి అన్నారు. చేనేత ఉత్పత్తులు భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని ఆమె అన్నారు. నేటికీ వన్నె తగ్గని హ్యాండ్లూమ్ దుస్తులను నేటి తరం మరింత ఆదరించాలని ఆమె కోరారు.
నాణ్యత, నవ్యత కలగలిసిన నేటి దుస్తులు హుందాతనంతో పాటు గౌరవాన్ని పెంచుతాయని గాజం అంజయ్య అన్నారు. హ్యాండ్లూమ్, పట్టు, కాంజీవరం, ఆర్గానికి చీరల వంటి మేటి రకాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు అన్నారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని రకాల చీరలు ఇక్కడి స్టోర్‌లో ఉన్నాయని వారు చెప్పారు.

పింకీరెడ్డి ఇలా...
పద్మశ్రీ అవార్డు గ్రహీత గాజం అంజయ్యతో సోషలైట్ పింకీ రెడ్డి ఇలా ముచ్చట్లు పెడుతూ కనిపించారు.

చీరెలను చూస్తూ పింకీ రెడ్డి
తాను ప్రారంభించిన స్టోర్‌లోని చీరలను పరిశీలిస్తూ పింకీ రెడ్డి ఇలా కనిపించారు. చేనేత దుస్తులను ప్రోత్సహించాలని ఆమె కోరారు.

చీరెను ప్రదర్శిస్తూ...
ప్రముఖ సోషలైట్ పింకీ రెడ్డి ఓ చేనేత చీరెను ప్రదర్శిస్తూ, దాని అందానికి మురిసిపోతూ ఇలా కనిపించారు.

స్టోర్ ప్రారంభం సందర్భంగా...
వీవర్స్ ఇండియా రెండో స్టోర్‌ను హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో ప్రముఖ సోషలైట్ పింకీరెడ్డి ఇలా ప్రారంభించారు.

చీరెతో పింకీరెడ్డి...
తనకు నచ్చిన ఓ చీరెను ఇలా ప్రదర్శిస్తూ, దాని అందచందాలను చూస్తూ పింకీ రెడ్డి ఇలా కనిపించారు.

స్టోర్‌లో ఇలా...
వీవర్స్ ఇండియా ప్రారంభించిన చేనేత స్టోర్‌లో ప్రముఖ సోషలైట్ పింకీ రెడ్డి కలియదిరుగుతూ ఇలా కనిపించారు.

చీరెలో మెరిసిపోతూ...
వీవర్స్ ఇండియా కొత్త స్టోర్‌లో చీరెను కట్టి, దానికి మరింత అందాన్నిస్తూ ప్రముఖ సోషలైట్ పింకీ రెడ్డి ఇలా కనిపించారు.

పరిశీలిస్తూ ఇలా...
వీవర్స్ ఇండియా ప్రారంభించిన కొత్త చేనేత స్టోర్‌లో అందమైన డిజైన్‌తో రూపొందించిన చీరెను కళ్లారా చూస్తూ పింకీ రెడ్డి ఇలా..

స్టోర్‌ను ప్రారంభిస్తూ...
హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో వీవర్స్ ఇండియా రెండో స్టోర్‌ను ప్రముఖ సోషలైట్ పింకీరెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.












Click it and Unblock the Notifications