వర్షంతో తడిసిన హైదరాబాద్ (పిక్చర్స్)

విశాఖపట్నం: ఎండలతో మండిపోతున్న స్థితిలో హైదరాబాద్ ప్రజలకు ఆదివారం వానదేవుడు ఊరట కలిగించాడు. రాష్ట్రానికి రుతుపవనాలు వచ్చాయి. ఈ స్థితిలో హైదరాబాద్‌లో వర్షం పడింది. ఇప్పటికే అండమాన్ దీవుల్లో ప్రవేశించిన రుతుపవనాలు ఆదివారం నాటికి సముద్రంలో ఎక్కువ ప్రాంతాలకు, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరికొన్ని వైపులకూ విస్తరించాయి.

మిగిలిన ప్రాంతాల దిశగా రుతుపవనాల విస్తరణకు బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలిస్తున్నదని భారత వాతావరణ విభాగం తెలిపింది. రానున్న 48 గంటల్లో అండమాన్ సముద్రంలో మిగిలిన ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలతోపాటు నైరుతి, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని అన్నారు.

ఇప్పుడు బంగాళాఖాతంలో భారీగా మేఘాలు ఆవరించి ఉన్నప్పటికీ, అండమాన్ సముద్రం నుంచి కోస్తా దిశగా రుతుపవనాలు విస్తరించాలంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతోపాటు అది వాయుగుండంగా బలపడి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి రావాలని వాతావరణ నిపుణుడు ఆర్.మురళీకృష్ణ వివరించారు.

సాధారణంగా ఏటా మే 20 నాటికి రుతుపవనాలు అండమాన్‌కు వస్తాయని, ఈసారి రెండురోజులు ముందుగానే ప్రవేశించాయని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రుతుపవనాల విస్తరణకు అండమాన్ శాఖలో వాతావరణం అనుకూలిస్తున్నదని చెప్పారు.

హైదరాబాద్ వర్షం

హైదరాబాద్ వర్షం

హైదరాబాదులో ఆదివారం కురిసిన వర్షంతో రోడ్లు జలమయం అయ్యాయి. ఆ జలాల్లో వాహనాలు ఇలా కదులుతూ కనిపించాయి.

మండుటెండల్లో చిరు జల్లు

మండుటెండల్లో చిరు జల్లు

ఎండలు మండిపోతుంటే నగర ప్రజలు వర్షం నీటిలో ఊరట పొందారు. తడుస్తూ ఇలా బైక్ మీద ప్రయాణిస్తుంటే ఏమి హాయిలే హలా...

వరదను ఎగజిమ్ముతూ...

వరదను ఎగజిమ్ముతూ...

వర్షానికి హైదరాబాదు రోడ్లు నీటితో నిండిపోయాయి. ఆ నీటిని ఎగజిమ్ముతూ కార్లు ఇలా ముందుకు సాగాయి.

సముద్రంలా...

సముద్రంలా...

వాననీటితో నిండిన హైదరాబాద్ రోడ్లు పోటెక్కుతున్న సముద్రం అలలా కనిపిస్తున్నాయి. ఈ స్థితిలో ప్రయాణం ఓ పెద్ద కసరత్తు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+