బ్రెస్ట్ కేన్సర్: గులాబీ రంగులో చార్మినార్ (ఫోటోలు)

హైదరాబాద్: రొమ్ము కేన్సర్ నివారణకు ప్రచారం చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉషాలక్ష్మీ బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ చేస్తోన్న కృషి అభినందనీయమని సినీ నటి చార్మి అన్నారు. హైదరాబాద్, బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఉషాలక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన 'పింక్ రిబ్బన్ క్యాంపెయిన్-2015' కార్యక్రమానికి చార్మి హాజరయ్యారు.

ఈ సందర్భంగా చార్మి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో నిర్వహించే పింక్ రిబ్బన్ క్యాంపెయిన్ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుందని చార్మి అన్నారు. ఇక, ఉషాలక్ష్మీ ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ రఘరామ్ మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల సహకారంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కల్పిస్తామన్నారు.

ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 6న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద రొమ్ము కేన్సర్‌పై పింక్ రిబ్బన్ క్యాంపెయిన్-2015 పేరుతో అవేర్‌నెస్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఉషాలక్ష్మీ బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని చార్మినార్, బుద్ధవిగ్రహం, ప్రసాద్ ఐ మ్యాక్స్, రవీంద్ర భారతి, కిమ్స్ ఆసుపత్రులకు గులాబీ విద్యుత్ దీపాలతో అలంకరించారు.

బ్రెస్ట్ కేన్సర్: గులాబీ రంగులో చార్మినార్

బ్రెస్ట్ కేన్సర్: గులాబీ రంగులో చార్మినార్

పింక్ రిబ్బన్ క్యాంపెయిన్-2015 భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

బ్రెస్ట్ కేన్సర్: గులాబీ రంగులో చార్మినార్

బ్రెస్ట్ కేన్సర్: గులాబీ రంగులో చార్మినార్

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యంతో కేన్సర్ ప్రస్తుతం మహమ్మారిలా మారింది. గత కొన్నేళ్లుగా రొమ్ము, గర్భాశయ ముఖ ద్వారా కేన్సర్లు మహిళలకను కబళిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్ష వరకు మహిళలు కొత్తగా రొమ్మ కేన్సర్ బారిన పడుతున్నారు.

 బ్రెస్ట్ కేన్సర్: గులాబీ రంగులో చార్మినార్

బ్రెస్ట్ కేన్సర్: గులాబీ రంగులో చార్మినార్

మెట్రో నగరాల్లో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. 60 శాతం మంది మహిళలు నాలుగో దశ దాటినా తర్వాతే వైద్యులను సంప్రదిస్తున్నారు. దీనివల్ల చికిత్స చేసినా అనుకున్నంత ప్రయోజనం కనిపించడం లేదు. అయితే రొమ్ము కేన్సర్‌ను మాత్రం చిన్న పరీక్షతో ముందుగానే గుర్తించవచ్చు.

 బ్రెస్ట్ కేన్సర్: గులాబీ రంగులో చార్మినార్

బ్రెస్ట్ కేన్సర్: గులాబీ రంగులో చార్మినార్

40 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఏటా ఒకసారి మమోగ్రామ్ ద్వారా రొమ్ము కేన్సర్‌ను గుర్తించే పరిజ్ఞానం ఇప్పుడు అన్ని చోట్లా అందుబాటులోకి వచ్చింది. రొమ్ము కేన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే, పూర్తిగా నయం చేయడం చాలా తేలిక. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏటా అక్టోబర్ నెలలో రొమ్ము కేన్సర్ అవగాహన నెలగా జురుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+