తెలంగాణ సంబురాలు, బోనమెత్తిన కవిత (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సంబరాలు జరిగాయి. శుక్రవారం రాత్రి ఈ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి.
కళా బృందాలు వివిధ కళారూపాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అస్సైదులా ఆటలు, బతుకమ్మ వేడుకలు, ఒగ్గు కళాకారుల డోలు వాయిద్యం, గోండ్ కళాకారుల థింశా నృత్యం, తెలంగాణ సంప్రదాయ ఫేరిణీ నృత్య రూపకం వంటి వివిధ ప్రదర్సనలు కళ్లను కట్టిపడేశాయి.
ప్రదర్శనలు జరుగుతున్నంత సేపు విద్యార్థులు, ఉద్యోగులు సందడి చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత బోనం ఎత్తుకుని విశ్వవిద్యాలయంలో కలియదిరిగి తిరిగి సభా స్థలికి చేరుకున్నారు.
హెచ్‌సియు హిందీ ప్రొఫెసర్ వి. కృష్ణ అధ్యక్షతను జరిగిన ఈ వేడుకల్లో ప్రొఫెసర్ వెంకటరమణ, టీఆర్ఎస్వీ హెచ్‌సియు అధ్యక్షుడు వెంకటేశ్ చౌహాన్, టీఆర్ఎస్వీ నాయకులు సుమన్, ఉపేందర్, ఈశ్వర్‌లతో పాటు హరినాథ్ పాల్గొన్నారు.

థింసా నృత్యం
హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం రాత్రి జరిగిన తెలంగాణ సాంస్కృతిక సంబరాల్లో గోండు కళాకారులు థింసా నృత్యాన్ని ప్రదర్శించారు.

సాంస్కృతిక ప్రదర్శన
హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణ సంబరాల్లో కళారూపాల ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది.

ఫేరిణీ నృత్యం
తెలంగాణ సంప్రదాయ నృత్యం ఫేరిణీ నృత్యం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచి అబ్బురపరిచింది.

బతుకమ్మతో...
తెలంగాణ ప్రత్యేక పండుగ బతుకమ్మ. బతుకమ్మను శిరసుపై ఉంచుకుని ఓ విద్యార్థిని ఇలా తన అభిమానాన్ని చాటుకుంది.

తెలంగాణ బతుకమ్మ...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విశిష్టమైన బతుకమ్మతో పూలతో ఇలా తమ హర్షాతిరేకాలను కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వ్యక్తం చేశారు.

బతుకమ్మ ఆడారు...
హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం రాత్రి మగువలు, విద్యార్థినులు బతుకమ్మ ఆట ఆడి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.

బోనమెత్తిన కవిత
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత బోనం ఎత్తుకుని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కలియదిరిగారు.

కవిత ఇలా...
హదైరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణ సాంస్కృతిక సంబరాల్లో కల్వకుంట్ల కవిత ఇలా చెట్టుకు నీళ్లు పోస్తూ..

ప్రదర్శనను తిలకిస్తూ...
తెలంగాణ సాంస్కృతి సంబరాల్లో భాగంగా ఏర్పాటైన చిత్ర ప్రదర్శనను తిలకిస్తూ పులకించిపోయిన కల్వకుంట్ల కవిత

నెమలి కొమ్ములతో..
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ సంబరాల్లో ఇలా కనిపించారు.

తన ఛాయాచిత్రాన్ని అందుకుంటూ...
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తన ఛాయా చిత్ర పటాన్ని స్వీకరిస్తూ ఇలా..












Click it and Unblock the Notifications