ఫేస్‌బుక్ కుట్ర! హైద్రాబాద్‌లో ఫైర్: ఏమిటీ ఫ్రీ బేసిక్స్? (పిక్చర్స్)

హైదరాబాద్: ఫ్రీ బేకిక్స్ వివాదం రేపుతోంది. ఫేస్‌బుక్ సంస్థ రిలయన్స్ సంస్థతో కలిసి ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్ పేరుతో ఇంటర్నెట్ పైన ఆధిపత్యం చలాయించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అందరు వ్యతిరేకించాలని, ఇది పూర్తిగా ఇంటర్నెట్ స్వేచ్ఛను ప్రజలకు దూరం చేయడమేనని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ రావు అన్నారు.

ఫ్రీ బేసిక్ ఫేస్‌బుక్‌ను వ్యతిరేకిస్తూ స్వేచ్ఛ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర రావు మాట్లాడుతూ... రిలయన్స్ సంస్థ ఫేస్‌బుక్‌తో కలిసి భారత్‌లో ఇంటర్నెట్ రంగంపై గుత్తాధిపత్యం సాగించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.

ఈ విధానం అమలులోకి వస్తే, సంస్థ ఇవ్వదలిచిన సేవలు మాత్రమే అందుబాటులోకి వస్తాయని, ప్రజలు కోరుకునే ఇంటర్నెట్ స్వేచ్ఛను కోల్పోతామన్నారు. దీని పైన దేశవ్యాప్తంగా ప్రజలందరూ వ్యతిరేకించాల్సిన అవసరముందన్నారు.

ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ఇంటర్నెట్ మాధ్యమానికి ప్రాచుర్యంలోకి తెచ్చేదిగా పేర్కొంటూ.. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ సంస్థ డేటా ఛార్జీల ప్రసక్తి లేకుండా కొన్ని వెబ్ సైట్లను ఉచితంగా అందించేందుకు ఫ్రీ బేసిక్స్ సర్వీసును తెరపైకి తీసుకు వచ్చింది.

ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ఇందుకోసం భారత్‌లో రిలయన్స్‌కు చెందిన ఆర్ కామ్‌తో చేతులు కలిపింది. అయితే, ఫ్రీ బేసిక్స్ అనేది నెట్ న్యూట్రాలిటీ (వెబ్ సైట్ల విషయంలో వివక్ష చూపకుండా తటస్థంగా వ్యవహరించడం) నిబంధనకు విరుద్ధంగా ఉందని వివాదం రేగిన విషయం తెలిసిందే.

 ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

తాజా వివాదం నేపథ్యంలో... ఫ్రీ బేసిక్స్ సేవల ఛార్జీల అంశం తేలేంత వరకు ఈ సర్వీసులను వాణిజ్యపరంగా ప్రవేశ పెట్టడాన్ని నిలిపేయాలని రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ను ట్రాయ్ ఆదేశించింది. ఈ సర్వీసులకు సంబంధించిన నియమ నిబంధనల వివరాలు ఇవ్వాలని కంపెనీని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ఈ సేవలకు సంబంధించి వివిధ కస్టమర్ల నుంచి వివిధ రకాలుగా వసూలు చేసే ఛార్జీలు, నియమ నిబంధనలు, షరతుల వివరాలు ఇచ్చేదాకా ఈ సేవలను ఆపేయాలని డిసెంబర్ 1న ఆర్ కామ్ (రిలయన్స్)కు ట్రాయ్ సూచించింది.

 ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

డిసెంబర్ 7వ తేదీన ట్రాయ్‌కు లేఖ రాసిన ఆర్ కామ్.. డిసెంబర్ 9వ తేదీ దాకా గడువును కోరింది. ట్రాయ్ ఆదేశాల మేరకు ఫ్రీ బేసిక్స్ వాణిజ్యపరమైన సర్వీసుల ప్రారంభాన్ని పక్కన పెట్టినట్లు ఆర్ కామ్ పేర్కొంది.

 ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ఫ్రీ బేసిక్స్‌ పేరుతో ఫేస్‌బుక్‌ భారత్‌లో ఇంటర్నెట్ పైన పూర్తి గుత్తాధిపత్యాన్ని సాధించేందుకు ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదట ఫేస్‌బుక్‌ తీసుకొచ్చిన ఇంటర్‌నెట్‌ డాట్ ఆర్గ్‌ పథకాన్ని నెటిజన్ల నుండి వచ్చిన పూర్తి వ్యతిరేకత కారణంగా దానిని నిషేధించింది.

 ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

అయితే ఇప్పుడు అదే పథకాన్ని ఫ్రీ బేసిక్స్‌ అని పేరు మార్చి ఫేస్‌బుక్‌ వినియోగదారులను తప్పుదోవ పట్టించడానికి ఏర్పాట్లు చేస్తోందని అంటున్నారు. ఫ్రీ బేసిక్స్ పైన అవగాహన లేనిచాలా మంది ఫేస్‌బుక్‌ వినియోగదారులు ఫ్రీబేసిక్స్‌కు మద్దతు తెలిపే అనుమతి బటన్‌ను ప్రెస్‌ చేస్తున్నారంటున్నారు.

ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్


ఈ ఫ్రీబేసిక్స్‌కు అనుమతిస్తే ప్రజాస్వామ్యయుతంగా ఉన్న ఇప్పటి ఇంటర్నెట్‌కు పెద్ద ప్రమాదం ఏర్పడనుందని, దీని వలన కేవలం ఫేస్‌బుక్‌ నిర్ణయించే కొన్ని వెబ్‌సైట్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాయని, మిగతా వెబ్‌సైట్లు వినియోగించాలంటే అధిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందంటున్నారు.

ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్


దీని వల్ల చిన్న వెబ్‌సైట్లు మార్కెట్‌లోకి వస్తున్న కొత్త కంపెనీల వెబ్‌సైట్లు నిలదొక్కుకోవడం అసాధ్యమని, దీంతో, దీర్ఘకాలం ఫేస్‌బుక్‌, దాని అనుబంద సంస్ధల తప్ప మిగతావన్నీ మూతపడి, ఇంటర్నెట్ పైన పూర్తి ఆధిపత్యాన్ని సాధిస్తాయని అంటున్నారు.

 ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ప్రజాస్వామ్యయుతంగా పని చేస్తున్న ఇప్పటి ఇంటర్నెట్ ప్రమాదంలో పడుతుందంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్రీ బేసిక్స్‌కు వ్యతిరేకంగా నెటిజన్లు, ప్రజా సంఘాలు ఆందోళనా కార్యక్రమాలు చేపడుతున్నాయి.


ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ప్రజాస్వామ్యయుతంగా పని చేస్తున్న ఇప్పటి ఇంటర్నెట్ ప్రమాదంలో పడుతుందంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్రీ బేసిక్స్‌కు వ్యతిరేకంగా నెటిజన్లు, ప్రజా సంఘాలు ఆందోళనా కార్యక్రమాలు చేపడుతున్నాయి.

ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ బేసిక్స్‌కు వ్యతిరేకంగా స్వేచ్చ సంస్థ పెద్ద ఎత్తున ఆందోళనా ఉద్యమాలు చేపట్టింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో పలుప్రాంతాల్లో విద్యార్థులు, ప్రచారం కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో ఫేస్‌బుక్‌ అసత్య ప్రచారం చేస్తోందంటూ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

 ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ఫ్రీ బేసిక్స్ ఫేస్‌బుక్

ఈ నేపథ్యంలో స్వేచ్ఛ సంస్థ హైదరాబాద్‌, గచ్చిబౌలి ప్రాంతంలో రహదారి పక్కనే తాత్కాలిక ఉద్యమ కార్యాలయాన్ని నిర్మించింది. స్వేచ్ఛ నిర్వాహకులు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అక్కడి నుంచే ఆన్‌లైన్‌ ప్రచారం చేపట్టారు. మంగళవారం ప్రదర్శన, బహిరంగసభ కార్యక్రమాలు జరిగాయి. ఈ ప్రదర్శనలో విద్యార్థులు, ఉద్యోగులు, నెటిజన్లు, రెండువేల మంది పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+