రజినీది ఉరిమే ఉత్సాహం: సచిన్ ప్రశంస(ఫొటో)
న్యూఢిల్లీ: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌పై భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. ఇండియన్ సూపర్ లీగ్-2 ఆరంభోత్సవ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ తోపాటు రజనీకాంత్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రజినీ చాలా ఉల్లాసంగా కనిపించారని, ఆ ఉరిమే ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించిందని సచిన్ ప్రశంసించాడు.
Mr. Rajnikanth's enthusiasm was infectious at the #ISL opening ceremony. Wishing all the teams the very best! pic.twitter.com/tIPUbShEiz
— sachin tendulkar (@sachin_rt) October 3, 2015 ఈ టోర్నీలో పా ల్గొంటున్న అన్ని జట్లకు ఆయన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారన్నాడు. రజనీతో ఫొటో దిగిన సచిన్.. ఈ విషయాన్ని తన ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. గతంలో కూడా రజినీని సచిన్ టెండూల్కర్ పలుమార్లు వివిధ సందర్భాల్లో కలిసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications