బతిమాలిన ప్రీతి: కొడుకుని ఏడ్పించారని..(పిక్చర్స్)

ముంబై: రెండు రోజుల క్రితం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచులో వీరేంద్ర సెహ్వాగ్ దూకుడు పంజాబ్‌ను తొలిసారి ఐపిఎల్లో ఫైనల్‌కు చేర్చింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలరో పంజాబ్ యజమాని ప్రీతిజింటా మాట్లాడుతూ.. ప్రతిసారి చెన్నై ఫైనల్‌కు వస్తుందని, ప్లీజ్ ప్లీజ్ ఈసారి అయినా పంజాబ్ రానీయాలంటూ బతిమాలినట్లుగా వ్యాఖ్యానించారు.

మరోవైపు వీరేంద్ర సెహ్వాగ్ తన తనయుడి కారణంగానే సెంచరీ బాదినట్లు చెప్పిన విషయం తెలిసిందే. తన కొడుకు కోసమే విధ్వంకర ఇన్నింగ్స్ ఆడినట్లు సెహ్వాగ్ మ్యాచ్ అనంతరం తెలిపాడు.

‘నేను బాగా ఆడట్లేదని స్కూల్లో నా కొడుకుని అతని స్నేహితులు ఏడిపిస్తున్నారట. అతని కోసమైనా భారీ ఇన్నింగ్స్ ఆడాలనుకున్నా. ఈ ఇన్నింగ్స్ తర్వాత నా కొడుకుని ఇంకెవరూ ఏడిపించరు' అని అన్నాడు.

ప్రీతి జింటా

ప్రీతి జింటా

శుక్రవారం నాడు చెన్నైతో జరిగిన మ్యాచులో వీరేంద్ర సెహ్వాగ్ దూకుడుగా ఆడి కేవలం 58 బంతుల్లో 122 పరుగులు చేసి పంజాబ్‌ను గెలిపించాడు. ఈ సందర్భంగా ప్రీతిజింటా ఆనందం.

వీరేంద్ర సెహ్వాగ్

వీరేంద్ర సెహ్వాగ్

భారత విధ్యంసకర బ్యాట్స్‌మన్ సెహ్వాగ్ రెచ్చిపోవడం వెనుక ఆయన కుమారుడున్నాడు. సెహ్వాగ్ తన కుమారుడితో మాట్లాడేందుకు ఫోన్ చేసిన సందర్భంగా తనయుడు ఆర్యవీర్ మాట్లాడుతూ... ఎందుకు డాడీ, ఊరికే అవుటవుతున్నావు? మీ డాడీకి పరుగులు చేయడం లేదంటూ స్కూల్‌లో నా స్నేహితులు గేలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

వీరేంద్ర సెహ్వాగ్

వీరేంద్ర సెహ్వాగ్

దానికి సమాధానంగా సెహ్వాగ్ తప్పకుండా భారీ స్కోరు చేస్తానని కుమారుడికి మాటిచ్చాడు. ఇచ్చిన మాటకు కట్టుబడ్డ సెహ్వాగ్ చెన్నైతో జరిగిన మ్యాచ్ లో వీరవిహారం చేసి కేవలం 58 బంతుల్లోనే 122 పరుగులు చేసి తానేంటో నిరూపించాడు.

చెన్నై, పంజాబ్

చెన్నై, పంజాబ్

వీరేంద్ర సెహ్వాగ్ దూకుడుగా ఆడటంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌లో సురేష్ రైనా ధీటుగా ఆడినా ఫలితం లేకుండా పోయింది.

సురేష్ రైనా

సురేష్ రైనా

చెన్నై సూపర్ స్టార్‌గా వెలుగుతున్న సురేష్ రైనా మెరుపు వేగంతో 25 బంతుల్లోనే 87 పరుగులు చేసి విజయంపై ఆశలు కల్పించాడు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యాలరు.

సురేష్ రైనా

సురేష్ రైనా

చెన్నై సూపర్ స్టార్‌గా వెలుగుతున్న సురేష్ రైనా మెరుపు వేగంతో 25 బంతుల్లోనే 87 పరుగులు చేసి విజయంపై ఆశలు కల్పించాడు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యాలరు.

సురేష్ రైనా

సురేష్ రైనా

చెన్నై సూపర్ స్టార్‌గా వెలుగుతున్న సురేష్ రైనా మెరుపు వేగంతో 25 బంతుల్లోనే 87 పరుగులు చేసి విజయంపై ఆశలు కల్పించాడు. అయితే, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యాలరు.

 పంజాబ్

పంజాబ్

వీరేంద్ర సెహ్వాగ్ తుఫాను ఇన్నింగ్స్‌తో శుక్రవారం వాంఖేడేలో జరిగిన మ్యాచులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 24 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. గెలిచిన ఆనందంలో పంజాబ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+