కేసీఆర్‌నూ లాగారు:రూ.500-1000లపై సెటైర్లు(పిక్చర్స్)

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో నల్ల కుబేరుల గుండెల్లో రైల్లు పరుగెడుతుండగా.. సామాన్యులు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నారు. కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. దేశంలోని నల్లధనం, నకిలీ కరెన్సీకి ఈ నిర్ణయంతో చెక్ పెట్టినట్లయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇది ఇలా ఉండగా, 500, 1000 రూపాయల నోట్లు రద్దు కావడంతో సోషల్ మీడియాలో ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. అంతేగాక, కొంతమంది నెటిజన్లు సెటైర్లు వేస్తూ నవ్వులు పుట్టిస్తున్నారు.

పల్లీల పొట్లం

పల్లీల పొట్లం

మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ. 500, రూ. 1000ల నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించంతో ఈ నోట్లపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలిపోతున్నాయి. ఓ నెటిజన్ ఇలా రూ. 500నోట్లను పల్లీల పొట్లంలా మార్చేశాడు.

దండేశారు

దండేశారు

ఎలాగూ చెల్లని రూపాయలు తమకెందుకన్నట్లూ.. ఓ నెటిజన్ సోషల్ మీడియాలో రూ. 500, 1000 నోట్లకు ఇలా దండేసెశారు.

ఇక చిప్స్ పొట్లాలకేనా..

ఇక చిప్స్ పొట్లాలకేనా..

రూ. 500, 1000 రూపాయల నోట్లు మంగళవారం అర్ధరాత్రి నుంచి చెల్లవని కేంద్రం ప్రకటించడంతో ఇలా చిప్స్ పొట్లంలా వాడేందుకు సిద్ధపడ్డారు కొందరు నెటిజన్లు.

నీకు నవంబర్ 8దే చివరి తేదీ

నీకు నవంబర్ 8దే చివరి తేదీ

రూ. 1000 నోటుకు చివరి తేదీ నవంబర్ 8దే అంటూ ఓ నెటిజన్ ఇలా గోడకు అంటించి దండేశాడు.

విజయ్ మాల్యాను వదల్లేదు

విజయ్ మాల్యాను వదల్లేదు

బ్యాంకులకు 9వేట్ల కోట్ల రుణం ఎగ్గొట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను కూడా నెటిజన్లు ఈ సందర్భంగా వదల్లేదు. తాను ఇప్పుడు రూ. 500, 1000 నోట్లను తిరిగిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ చెప్తున్నట్లు చిత్రీకరించారు.

పిల్లలకు ఆట వస్తువులా.

పిల్లలకు ఆట వస్తువులా.

చెల్లని నోట్ల కదా అని కొందరు తమ పిల్లలకు ఆట వస్తువులా ఇలా ఇచ్చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి.

కేసీఆర్‌ను లాగారు

కేసీఆర్‌ను లాగారు

చెల్లని నోట్ల వ్యవహారంలోకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా లాగారు నెటిజన్లు. ‘ఆర్బీఐ గవర్నర్ నాకు మంచి దోస్త్ లెక్క!! మన పార్టీ రంగులో మంచిగ గుద్దిచ్చిన కొత్త రూ. 200నోట్లు' పేర్కొన్నారు.

మేకలకు మేత

మేకలకు మేత

చెల్లని నోట్లంటే ఎవరేం చేసుకుంటారు.. అందుకే ఇలా నోట్లకు మేతగా వేశామంటూ కొందరు నెటిజన్లు.

తరలింపు

తరలింపు

చెల్లని నోట్లు అంటే చెత్తతో సమానమే అంటూ ఇలా చెత్త ట్రాలీలో తరలించేస్తున్నామంటూ ఓ నెటిజన్ సెటైర్ వేశారు.

బై బై

బై బై

ఇక చెల్లని నోట్లు మాకెందుకు.. కొత్త నోట్లు వస్తున్నాయిగా.. అంటూ ఇలా దండెం దండం పెట్టేశారు నెటిజన్లు.

డ్రంక్ అండ్ డ్రైవ్ సెటైర్

డ్రంక్ అండ్ డ్రైవ్ సెటైర్

రూ. 500, 1000 నోట్లు చెల్లకపోవడంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పెద్ద మొత్తం జరిమానా విధించలేరని ఇలా సెటైర్ వేశారు ఓ నెటిజన్.

కాల్చేస్తున్నారే..

కాల్చేస్తున్నారే..

మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ. 500, 1000 నోట్లను కేంద్రం రద్దు చేయడంతో ఇలా పొయ్యి పెట్టి కాల్చేస్తున్నట్లు సెటైర్ వేశాడు ఓ నెటిజన్. అయితే, బ్యాంకులు ఈ నోట్లను ఇస్తే రూ. 100 నోట్లు ఇస్తారనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+