వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్రెస్టింగ్ సర్వే: పెళ్లిపై యువత మాటేంటో తెలుసా?

25 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సున్న 14,700 మందిని పెళ్లి మీద తమ అభిప్రాయం చెప్పాల్సిందిగా షాదీ.కామ్ కోరింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెళ్లి మీద ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. కొందరు త్వరగా పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోవాలని భావిస్తే.. ఇంకొందరు ముందు కెరీర్, ఆ తర్వాతే పెళ్లి అన్న భావనలో ఉంటారు. అలాగే పెళ్లి చేసుకుంటే కలిసొస్తుందని భావించేవారు లేకపోలేదు.

తాజాగా షాదీ.కామ్ నిర్వహించిన ఓ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా 25 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సున్న 14,700 మందిని ప్రశ్నించి ఓ జాబితాను తయారుచేశారు.

సర్వే ప్రకారం.. కొంతమంది యువతను పెళ్లి గురించి ప్రశ్నించగా.. త్వరగా పెళ్లి చేసుకోవడమే బెటర్ అని 20.5 శాతం మంది యువకులు, 23.1 శాతం మంది యువతులు తెలిపినట్టుగా సర్వే పేర్కొంది.

Shaadi.com Surveys Attitudes on Marriage

ఇక జీవితంలో అసలు పెళ్లే వద్దనుకుంటున్నవారు కూడా లేకపోలేదు.నాకు పెళ్లే వద్దని 12.2 శాతం మంది యువకులు, 10.3 శాతం మంది యువతులు అభిప్రాయపడ్డారు. 18.2 శాతం మంది యువకులు, 13.2 శాతం మంది యువతులు ఎప్పుడు చేసుకుంటామో చెప్పలేమని సమాధానం చెప్పారు.

పెళ్లి ఎందుకు వద్దంటున్నారంటే?:

పెళ్లంటే బరువు బాధ్యతల వ్యవహారమని అందుకే దానికి దూరంగా ఉండటమే బెటర్ అని 35.1 శాతం మంది యువకులు, 27.2 శాతం మంది యువతులు చెప్పారు. ఇక అసలు పెళ్లిపై నమ్మకమే లేదని 23.2 శాతం మంది యువకులు, 21.3 శాతం మంది యువతులు చెప్పారు.

ఎక్కువ రోజులు కలిసుండే సంబంధాలను తాము కొనసాగించలేమని 26.3 శాతం మంది యువకులు, 20.3 శాతం మంది యువతులు అభిప్రాయపడటం గమనార్హం.

పెళ్లితో వచ్చే అతిపెద్ద లాభమేంటి?:

ఈ ప్రశ్నకు సమాధానంగా.. ఇద్దరి మధ్యా బంధం బలపడుతుందని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. మరికొంతమంది జీవిత భాగస్వామి లభిస్తుందని, ఆర్థికంగా స్థిరపడే అవకాశం దొరుకుతుందని తెలిపారు.

English summary
Matchmaking Web site Shaadi.com is out with its annual survey of its members’ matrimonial attitudes. The data offers some fascinating–and, in some cases
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X